మన మూవీ చూడబోతున్న హాలీవుడ్ స్టార్ డైరెక్టర్
హాలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శకుడు క్లింట్ ఈస్ట్వుడ్ త్వరలోనే మన ఇండియన్ మూవీ అది కాకుండా మన తమిళ సినిమా అయిన జిగర్ తండ : డబుల్ ఎక్స్ ని చూసేందుకు ఓకే చెప్పాడు.
హాలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శకుడు క్లింట్ ఈస్ట్వుడ్ త్వరలోనే మన ఇండియన్ మూవీ అది కాకుండా మన తమిళ సినిమా అయిన జిగర్ తండ : డబుల్ ఎక్స్ ని చూసేందుకు ఓకే చెప్పాడు. విభిన్నమైన కాన్సెప్ట్ తో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన జిగర్ తండ సినిమా తమిళనాట భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
రాఘవ లారెన్స్ మరియు ప్రముఖ దర్శకుడు ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో పాత్రలను చాలా విభిన్నంగా చూపించడంతో పాటు అరుదైన వీఎఫ్ఎక్స్ వర్క్ ను వినియోగించినట్లు విడుదల సమయంలో రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం అందరికి తెల్సిందే.
తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమా గురించి తెలియజేస్తూ ఒక నెటిజన్ హాలీవుడ్ దర్శకుడు క్లింట్ ఈస్ట్వుడ్ ను ట్యాగ్ చేసి మిమ్ములను ఆదర్శంగా తీసుకుని ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను చూపించడం జరిగింది. ఇది ఒక ఇండియన్ సినిమా.. ఇది మీకు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది అంటూ ట్వీట్ చేయడం జరిగింది.
నెటిజన్ చేసిన ట్వీట్ కు హాలీవుడ్ దర్శకుడు క్లింట్ స్పందించాడు. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ నిమిత్తం బిజీగా ఉన్నాను. త్వరలోనే మీరు చెప్పిన మూవీ చూస్తాను అన్నట్లుగా సమాధానం ఇవ్వడం జరిగింది. క్లింట్ రిప్లై కి సదరు నెటిజన్ తో పాటు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్లింట్ తమ జిగర్ తండ చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతాడా అంటూ ఎదురు చూస్తున్నట్లుగా కార్తీక్ సుబ్బరాజు ట్వీట్ చేశాడు.