'మార్కో'ని హోంబలే ఫిల్మ్స్ లాక్ చేసిందా!
దీంతో హనీఫ్ పై ఇప్పటికే టాలీవుడ్ కన్ను పడినట్లు వార్తలొచ్చాయి. ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ అతన్ని లాక్ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టిందని మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇటీవల రిలీజ్ అయిన మలయాళ చిత్రం `మార్కో` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ అదేని తెరెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అత్యంత వయోలెన్స్ తో తెరకెక్కించిన చిత్రం ఏ సర్టిపికెట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి మాలీవుడ్ కి గ్రాండ్ విక్టరీ అందించింది. `యానిమల్` తరహా మేకింగ్ లా ఉన్నా క్రైమ్ ని మరింత బలంగా చెప్పిన చిత్రంగా నిలిచింది. 30 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూళ్లు సాధించింది.
ఈ రేంజ్ యాక్షన్ ని ఇంతవరకూ ఇండియాలో ఏ డైరెక్టర్ ట్రై చేయలేదు. తొలిసారి ప్రయత్నించి హనీఫ్ గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. దీంతో హనీఫ్ పై ఇప్పటికే టాలీవుడ్ కన్ను పడినట్లు వార్తలొచ్చాయి. ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ అతన్ని లాక్ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టిందని మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే అంతకన్నా ముందే హనీఫ్ ని హోంబలే ఫిల్మ్స్ లాక్ చేసిందన్న వార్త తాజాగా వెలుగులోకి వస్తోంది. హనీఫ్ కి భారీ అడ్వాన్స్ ఇచ్చి తమ బ్యానర్లో సినిమా చేయాల్సిందిగా కోరిందట.
అందుకు హనీఫ్ కూడా అగ్రిమెంట్ చేసుకున్నాడట. అయితే కథ రాయడానికి మాత్రం రెండేళ్లు పడుతుందని అంత వరకూ తనపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదని కోరాడట. ఆ ప్రపోజల్ కి కూడా హోంబలే ఫిల్మ్స్ ఒప్పుకుందట. ఇదే తరహాలో రిషబ్ శెట్టిని కూడా హోంబలే ఫిల్మ్స్ గతంలో లాక్ చేసిన సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి స్వీయా దర్శకత్వంలో తెరకెక్కించిన `కాంతార` భారీ విజయం సాధించడంతో..అతడి ప్రతిభను గుర్తించి వెంటనే అప్రోచ్ అయి `కాంతార2` తమ బ్యానర్లో చేసేలా ఒప్పందం చేసుకున్నారు.
అందుకు గానూ భారీ మొత్తం లో పారితోషికం చెల్లించారు. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడం కోసం కావాల్సి నంత సమయాన్ని రిషబ్ శెట్టికి సందరు సంస్ధ అందించింది. ప్రస్తుతం `కాంతార 2` సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే స్ట్రాటజీతో హనీఫ్ విషయంలో హోంబలే ఎంటర్ అయింది. మరి `మార్కో-2` క్యూబ్ సినిమాస్ నుంచి హోంబోలే ఫిల్మ్స్ రైట్స్ దక్కించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.