లైంగికంగా వేధిస్తున్నాడు.. బిజినెస్‌మేన్‌పై హ‌నీరోజ్ ఫిర్యాదు

మలయాళ క‌థానాయిక‌ హనీ రోజ్ ఒక బిజినెస్‌మేన్‌ తనను వెంబడిస్తున్నాడని, సోష‌ల్ మీడియాల్లో అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు.

Update: 2025-01-05 16:14 GMT

మలయాళ క‌థానాయిక‌ హనీ రోజ్ ఒక బిజినెస్‌మేన్‌ తనను వెంబడిస్తున్నాడని, సోష‌ల్ మీడియాల్లో అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. అత‌డి చెడు ప్ర‌వ‌ర్త‌న ఆగ్రహానికి గురిచేసిందని పేర్కొన్నారు. సామాజిక మాధ్య‌మాల్లో స్త్రీల‌ను అవ‌మానించ‌డం ఆమోద‌యోగ్యం కాద‌ని హ‌నీరోజ్ ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. అయితే త‌న‌ను వేధిస్తున్న ఆ వ్య‌క్తి లేదా బిజినెస్ మేన్ ఎవ‌రు? అన్న‌ది హ‌నీరోజ్ వెల్లడించలేదు.

ఆ వ్యక్తి మొదట తనను ఒక కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించాడని, ఆ ఆహ్వానాన్ని తాను అంగీకరించానని పేర్కొంది. అత‌డి నుంచి మ‌ళ్లీ మ‌ళ్లీ ఆహ్వానాలు అందాయి. వాటిని తిరస్కరించిన తర్వాత ఆ వ్యక్తి ప్రతీకారం తీర్చుకునేందుకు తనను అవమానించడం ప్రారంభించాడని హ‌నీరోజ్ తాజాగా రాసిన లేఖ‌లో(ఇన్ స్టాలో ఉంది) ఆరోపించారు. అత‌డు త‌న‌ను ప‌దే ప‌దే వెంబ‌డిస్తున్నాడు. తాను పాల్గొనే కార్యక్రమాల‌లో త‌న‌ను ఫాలో చేస్తున్నాడ‌ని హ‌నీరోజ్ ఒక లేఖ (మ‌ల‌యాళ భాష‌లో) ద్వారా వెల్ల‌డించారు. ఉద్దేశపూర్వకంగానే తన నిరాడంబరతను కించపరిచేలా అత‌డు కామెంట్లు చేస్తున్నాడు. రెగ్యుల‌ర్ గా సోష‌ల్ మీడియాను ఈ వ్యాఖ్యలకు వేదికగా ఉపయోగించుకుంటున్నారని హ‌నీ రోజ్ ఆరోపించారు.

ఇలాంటి త‌ప్పుడు ప్రవర్తన నుండి న్యాయ వ్యవస్థ స్త్రీల‌కు ఎటువంటి రక్షణను అందించలేదా? అనేది తెలుసుకోవాలని ఉంది. లైంగికంగా కామెంట్లు చేయ‌డం.. అలాంటి ఉద్దేశ్యంతో స్త్రీని వెంబడించడం ప్రాథమిక నేరాలు కాదా? అని హ‌నీ రోజ్ ఈ లేఖ‌లో ప్ర‌శ్నించారు. అలాంటి వ్యాఖ్యలను తాను ధిక్క‌రిస్తాన‌ని.. సానుభూతితో విస్మరిస్తే చేత‌కాద‌నే అర్థం వ‌స్తుంద‌ని కూడా హ‌నీరోజ్ రాసారు. ఈ భామ‌ మలయాళం, తమిళం, తెలుగు భాషలలో న‌టించారు. నంద‌మూరి బాల‌కృష్ణ `వీర సింహారెడ్డి` చిత్రంతో హ‌నీరోజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత వ‌రుసగా తెలుగు చిత్రాల్లో న‌టించారు.

Tags:    

Similar News