డ్రెస్సులపై కామెంట్స్... హనీరోజ్ దిమ్మతిరిగే రియాక్షన్!
సోషల్ మీడియా వేదికగా తాను వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపిన మలయాళ నటి హనీరోజ్.. పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈమె ఫిర్యాదుతో సుమారు 27 మందిపై ఎర్నాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియా వేదికగా తాను వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపిన మలయాళ నటి హనీరోజ్.. పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈమె ఫిర్యాదుతో సుమారు 27 మందిపై ఎర్నాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో.. ఇందులో కీలక వ్యక్తిగా భావించిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును ఇటీవల సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆమె... తన లుక్స్ పై సరదా జోక్స్, మీమ్స్ ను తాను స్వాగతిస్తానని.. వాటిని పెద్దగా పట్టించుకోకని తెలిపారు. అయితే... అవి హద్దూ దాటి, అసభ్యకరంగా మారితే మాత్రం సహించనని స్పష్టం చేశారు. ఈ సమయంలో బాబీ చెమ్మనూరుకు మద్దతుగా నిలిచారు ఓ కామెంటేటర్. అతనిపై హనీ రోజ్ దిమ్మతిరిగేలా రియాక్ట్ అయ్యింది.
అవును... సోషల్ మీడియా వేదికగా తనను వేధింపులకు గురిచేసిన బాబీ చెమ్మనూరును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న వేళ అతనికి మద్దతుగా నిలిచారు కామెంటేటర్ రాహుల్ ఈశ్వర్. ఈ సందర్భంగా స్పందిస్తూ... ఆమె ధరించే డ్రెస్సులపై విమర్శిస్తూ ఇలాంటి కామెంట్లు సమాజంలో సహజమేనని అన్నారు.
దీంతో... రాహుల్ ఈశ్వర్ పై హనీ రోజ్ విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా.. ఆలయ పూజారుల కుటుంబానికి చెందిన రాహుల్ ఈశ్వర్ స్వయంగా ఆలయ పూజారి కాకపోవడం అదృష్టమే అని మొదలు పెట్టిన హనీ రోజ్... అతనే పూజారి అయితే ఆలయానికి వచ్చే మహిళలకు డ్రెస్ కోడ్ విధించి ఉండేవాడు అంటూ ఘాటుగా స్పందించారు.
ఇదే సమయంలో... స్త్రీల దుస్తులను చూసినప్పుడు అతనికి భాషపై కంట్రోల్ విఫలమైనట్లు కనిపిస్తుంది.. ఎలాంటి వస్త్రధారణ మీ స్వీయ నియంత్రణకు భంగం కలిగిస్తుందో ఎవరు అంచనా వేయగలరు? అని ప్రశ్నిస్తూ దిమ్మతిరిగేలా రియాక్ట్ అయ్యారు హనీ రోజ్!
కాగా... హనీరోజ్ కు మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ సంఘం (అమ్మ) మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఆమెపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నవారిపై చట్టపరంగా తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని.. అవసరమైతే న్యాయ సహాయం అందజేస్తామని తెలిపింది.