కోటి కడతారా..డిలీట్ చేస్తారా..!

2023 లో వచ్చిన హాస్టల్ హుడుగురు బేకాగిద్దారె సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది.

Update: 2025-01-08 15:30 GMT

కంటెంట్ ఉంటే చాలు అందులో నటించిన నాయకా నాయికలు ఎవరన్నది తెలియకపోయినా సరే మాకు అవసరం లేదు సినిమా హిట్ చేస్తాం అనేలా ఉన్నారు నేటి తరం సినీ ప్రేమికులు. ఐతే స్టార్ సినిమాలకు కాస్త బజ్ ఎక్కువ ఉండి ఫస్ట్ రోజు నుంచి ఓపెనింగ్స్ బాగుంటాయి కానీ కంటెంట్ ఉన్న సినిమా స్లో గా మొదలైనా సరే ఆడియన్స్ కు రీచ్ అయితే దాని గ్రాఫ్ ఊహించడం కూడా కష్టమే అనేలా ఉంటుంది. ఐతే మన దగ్గర కన్నా మలయాళంలో ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తారు.

2023 లో వచ్చిన హాస్టల్ హుడుగురు బేకాగిద్దారె సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ టార్గెట్ తో తెరకెక్కింది. నితిన్ కృష్ణమూర్తి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రజ్వల్‌ బిపి, మంజునాథ్‌ నాయక, రాకేష్‌ రాజ్‌కుమార్‌, తేజస్‌ జయన్న, శ్రీవత్స నటించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో బాయ్స్ హాస్టెల్ అని డబ్ చేసి రిలీజ్ చేశారు.

సినిమా యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఐతే ఈ సినిమాపై తాజాగా సౌత్ హీరోయిన్ రమ్య కోర్టుకి వెళ్లారు. సినిమాలో తన పర్మిషన్ లేకుండా తన క్లిప్స్ వాడినట్టు రమ్య తన ఫిర్యాదులో రాసుకొచ్చారు. ఎన్నోసార్లు తన వీడియో డిలీట్ చేయమని అడిగినా సరే నిర్మాతల నుంచి సరైన సమాధానం రావట్లేదని.. అందుకే కోర్ట్ కేస్ దాకా ఇష్యూని తీసుకెళ్లింది. తన పర్మిషన్ లేకుండా తన క్లిప్స్ వాడినందుకు కోటి దాకా పరువు నష్టం ఇవ్వాలని అమ్మడు డిమాండ్ చేస్తుంది.

తనకు డబ్బులు ముఖ్యం కాదు కోటి ఇవ్వకపోయినా వీడియో డిలీట్ చేయాలని హీరోయిన్ కోరుతుంది. నిర్మాతలకు రమ్య ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా పని జరగట్లేదని ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది. ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన రమ్య ఆ తర్వాత ఎంపీగా గెలిచింది. ఐతే ప్రస్తుతం సినిమాలు రాజకీయాలు రెండిటికీ దూరంగా ఉంటుంది. ఈమధ్య స్టార్ సినిమాలకు సంబంధించిన ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే వీడియోస్ వాడేస్తున్నారు. ఈమధ్యనే నయనతార డాక్యుమెంటరీలో నిర్మాణ సంస్థ పర్మిషన్ లేకుండా వీడియో క్లిక్ పెట్టిందని నానా హడావుడి చేశారు. మరి రమ్య విషయంలో కోర్టు ఏం తీర్పు ఇస్తుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News