హృతిక్ రోషన్ డూప్ అంటే హృతిక్ ని మించేలా..?
ఐతే వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాలీవుడ్ స్టార్ హ్యాండ్సం హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్ 2 సినిమా చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భాగం అవుతున్నాడని తెలిసిందే. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్క్రీన్ షేరింగ్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. ఐతే వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హృతిక్ రోషన్ బాడా డబుల్ అదేనండి డూప్ తో కనిపించాడు.
హృతిక్ రోషన్ డూప్ తో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హృతిక్ రోషన్ డూప్ అచ్చం హృతిక్ లానే కాదు కాదు హృతిక్ ని కూడా దాటేలా ఉన్నాడు. పైకి యాక్షన్ సీన్స్ అన్నీ ఎలాంటి డూప్ లేకుండా మేమే చేశామని హీరోలు ఎంత చెప్పినా కచ్చితంగా బాడీ డబుల్ ఉంటుంది. స్టార్ డూప్ గా నటించే వ్యక్తులు బయట ఎక్కువ కనిపించరు.
ఐతే వార్ 2 సెట్ లో హృతిక్ రోషన్ డూప్ చూసిన ఆడియన్స్ అవాక్కవుతున్నారు. దూరం నుంచి చూస్తే ఎవరు హృతిక్ ఎవరు డూప్ అనిపించేలా ఉన్నాడు ఆ వ్యక్తి. డ్రెస్, స్టైల్, లుక్ అన్నీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశాడు. వార్ 2లో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది. సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నువ్వా నేనా అన్న రేంజ్ లో నటించారని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఫైటర్ సినిమాతో వచ్చిన హృతి రోషన్ వార్ 2 తో భారీ టార్గెట్ పెట్టుకున్నాడు.
ఎన్టీఆర్ కూడా వార్ 2 తో స్ట్రైట్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. మరి ఈ కాంబో సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. వార్ 2 లో ఎలాగు తారక్ ఉన్నాడు కాబట్టి సౌత్ లో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడు సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలు హిందీలో హిట్ సూపర్ హిట్ అని చెబుతున్నారు. వార్ 2 ని సౌత్ లో కూడా ఆ రేంజ్ సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే సౌత్ లో కూడా సినిమాను భారీ రిలీజ్ తో పాటుగా భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.