హృతిక్ రోషన్ సంచలన నిర్ణయం!
`క్రిష్-4`కి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసిన సంగతి తెలిసిందే. రాకేష్ రోషన్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతగా శ్రమిస్తున్నారో రివీల్ చేసారు;

`క్రిష్-4`కి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసిన సంగతి తెలిసిందే. రాకేష్ రోషన్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతగా శ్రమిస్తున్నారో రివీల్ చేసారు.`క్రిష్ -4` కి సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయని, ము నుపటి భాగాలకంటే మరింత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సినిమా బడ్జెట్ సమస్యల్లో ఉందని అయినా...ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తామని స్పష్టం చేసారు.
రాజీ పడితే స్టోరీ లైన్ దెబ్బ తింటుందని కానీ నేను ఏ విషయంలోనూ రాజీ పడేది లేదని, అనుకున్నది అనుకున్నట్లు తీస్తానని వెల్లడించారు. అలాగే `కోయి మిల్ గయా`లో సందడి చేసిన జాదూ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు హింట్ ఇచ్చారు. అలాగే `క్రిష్ -4` పూర్తిగా అంతరిక్షంలో జరిగే అద్భుతమని స్పష్టం చేసారు. అయితే ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసే డైరెక్టర్ విషయంలో ఇంత వరకూ క్లారిటీ రాలేదు.
రాకేష్ రోషన్ హ్యాండిల్ చేస్తారా? లేక కొత్త దర్శకుడిని తెరపైకి తెస్తారా? అన్న సందేహాలు చాలా కాలంగా ఉన్నాయి. దీనిపై రాకేష్ రోషన్ కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాజాగా డైరెక్టర్ ఎవరు? అన్న దానిపై బిగ్ బ్రేకింగ్ వచ్చేసింది. ఈ సినిమా కోసం హీరోనే డైరెక్టర్ గా మారుతుడున్నాడు. హృతిక్ రోషన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆదిత్య చోప్రా-రాకేష్ రోషన్ -హృతిక్ రోషన్ ముగ్గురు డిస్కస్ చేసుకున్న అనంతరం హృతిక్ పేరును ఫైనల్ చేసారు.
దీంతో ఇప్పుడీ వార్త సంచలనంగా మారింది. ఇంత వరకూ హృతిక్ రోషన్ కెప్టెన్ కుర్చీ ఎక్కింది లేదు. డైరెక్టర్ గా ఎలాంటి అనుభవం లేదు. సొంత ప్రొడక్షన్ హౌస్ లో వివిధ చిత్రాలకు వివిధ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఇప్పుడా ఆ అనుభవం...క్రిష్ ప్రాంచైజీలో నటించిన అనుభవంతో ధైర్యంగా డైరెక్టర్ గా అడుగులు వేస్తున్నాడు. `క్రిష్` ప్రాంచైజీపై హృతిక్ రోషన్ కి పూర్తి అవగాహన ఉంది. అందుకే దైర్యంగా ముందడుగు వేస్తున్నాడు. అయితే ఒకేసారి హీరోగా...డైరెక్టర్ గా పనిచేయడం అన్నది కత్తి మీద సాము లాంటిదే. అందులోనూ సూపర్ హీరో చిత్రాలు తెరకెక్కిచడం అంటే మరింత సవాల్ గా మారుతుంది.