హృతిక్.. తారక్ విశ్వరూపం చూసినట్లున్నాడు..
జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. తెలుగు ప్రేక్షకులకు ఇది తెలిసిన విషయమే కానీ, ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా అదే మాట చెప్పాడు.;

జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. తెలుగు ప్రేక్షకులకు ఇది తెలిసిన విషయమే కానీ, ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా అదే మాట చెప్పాడు. రీసెంట్‌గా జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో హృతిక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన ఫేవరెట్ కోస్టార్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు.. ఆలోచించకుండా "జూనియర్ ఎన్టీఆర్" అని సమాధానం చెప్పిన హృతిక్, తారక్ మీద ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని చూపించాడు.
ఈ ఇద్దరు కూడా వార్ 2లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తారక్ బాలీవుడ్ ఎంట్రీపై గతంలో చాలా రకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం నిజమైన ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా ఆయన ముంబయి మార్కెట్‌ను షేక్ చేయనున్నట్లు అర్ధమవుతుంది. హృతిక్ లాంటి నేషనల్ క్రేజ్ ఉన్న హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేయడం తారక్ కెరీర్‌లో కీలక మలుపుగా మారబోతోంది.
హృతిక్ మాటలను బట్టి చూస్తే, తారక్ తన విశ్వరూపాన్ని బాలీవుడ్‌లో చూపించినట్లే కనిపిస్తోంది. వార్ 2 కోసం ఆయన చేసిన ప్రిపరేషన్, నటన స్టైల్ బాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హృతిక్.. షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ స్టార్స్ తో సినిమాలు చేసినప్పటికీ ఎన్టీఆర్ ఇష్టమైన కో స్టార్ అని చెప్పడం విశేషం.
రీసెంట్‌గానే తనతో వార్ 2 సినిమా కంప్లీట్ చేశానని చెబుతూ.. అతడు అమేజింగ్.. మంచి టీమ్మేట్. వార్ 2లో అద్భుతంగా చేశాం అనుకుంటున్నా అని ఒక క్లారిటీ ఇచ్చాడు. దీన్ని బట్టి షూటింగ్ లో తారక్ తన విశ్వరూపం చూపించి ఉండవచ్చని అర్ధమవుతుంది. అసలే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర. కాబట్టి హృతిక్ ను డామినేట్ చేసేదే అయ్యి ఉండవచ్చు. అతని టాలెంట్ కు హృతిక్ అనే కాదు రిలీజ్ తరువాత బాలీవుడ్ సైతం ఫిదా అవ్వడం పక్కా.
ఇటీవల కొన్ని రూమర్స్‌లో ‘వార్ 2’ ఆగస్ట్ 14న రాదని, మరోసారి వాయిదా పడే అవకాశముందని చర్చ జరిగింది. కానీ హృతిక్ స్పష్టంగా “వార్ 2 సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలోకి రాబోతోంది. మా ఇద్దరం చేసిన పని బాగా వచ్చిందని నమ్మకంగా చెబుతున్నాను” అంటూ చెప్పడంతో, ఆ గాసిప్స్‌కి ఫుల్ స్టాప్ పడినట్టే అయ్యింది. ఇక హృతిక్ రోషన్ మాటల్లో కనిపించిన ఎన్టీఆర్‌కి ఉన్న గౌరవం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇది తారక్ రేంజ్.. బాలీవుడ్‌లో కూడా తారక్ ఫ్యాన్ బేస్ పెరుగుతోంది.. వార్ 2 తారక్ డెబ్యూ కాదు, డామినేషన్ స్టార్ట్.. అనే కామెంట్స్ తో ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.