పుష్ప-2 టికెట్స్ కాస్ట్.. అవన్నీ తూచ్!

ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్.. సీక్వెల్ కు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు

Update: 2024-11-22 08:15 GMT

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2.. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్.. సీక్వెల్ కు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే పుష్ప-2పై ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. సౌత్ లోనే కాదు.. నార్త్ లో వేరే లెవెల్ హైప్ ఉంది. అందుకు ఉదాహరణ బీహార్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన రెస్పాన్సే. అలా వరల్డ్ వైడ్ గా సినీ ప్రియులతో పాటు బన్నీ అభిమానులు.. ఎప్పుడెప్పుడా మూవీ చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అదే సమయంలో సోషల్ మీడియాలో పుష్ప-2కు సంబంధించిన కొన్ని తప్పుడు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా సినిమా వాయిదా పడుతుందని జోరుగా ప్రచారం సాగింది. దీంతో మూవీ టీమ్ నెట్టింట స్పందించింది. సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని ఓ పోస్ట్ ద్వారా అందరికీ క్లారిటీ ఇచ్చేసింది.

అయితే పుష్ప-2 టికెట్స్ రేట్ల పెంపు విషయంలో మేకర్స్ భారీ ప్లాన్ లో ఉన్నారని కొద్దిరోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. పెద్ద ఎత్తున రేట్లు పెంచుతారని రూమర్స్ వస్తున్నాయి. పుష్ప-1 విషయంలో టికెట్‌ రేట్ల పెంపు వర్కౌట్‌ కాలేదని.. ఈసారి మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కానీ అదేం నిజం కాదని తెలుస్తోంది. రీసెంట్ గా వచ్చిన పెద్ద సినిమాల టికెట్ల ధరల్లాగే పుష్ప-2 రేట్స్ కూడా ఉంటాయని సమాచారం. అనవసరంగా కొందరు తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారట. వాస్తవ విషయాలను తెలుసుకోకుండా కావాలనే.. మేకర్స్ భారీగా టికెట్ ధరలు పెంచుతున్నారని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారట.

అయితే టికెట్స్ రేట్స్ పెంపు విషయంలో వస్తున్న రూమర్స్ నిజం కాకపోతే సినీ ప్రియులకు పండగే అనే చెప్పాలి. ఎందుకంటే వాస్తవానికి మల్టీప్లెక్స్ లో టికెట్ ధర కాస్త ఎక్కువ ఉంటుంది. అదే సింగిల్ స్క్రీన్ లో రేట్.. వాటితో పోలిస్తే తక్కువ ఉంటుంది. దీంతో చాలా మంది అక్కడ సినిమాను చూడాలనుకుంటారు. ఇప్పుడు వాటి ధరలను భారీగా పెంచితే కొందరు ఇబ్బంది పడాల్సి వస్తుందని నెటిజన్లు చెబుతున్నారు. కాబట్టి మేకర్స్.. మరీ ఎక్కువ పెంపు కోరుకోకపోతే సానుకూల విషయమని అంటున్నారు.

Tags:    

Similar News