Begin typing your search above and press return to search.

గబ్బర్ సింగ్ రీ రిలీజ్.. ఆలా జరిగిందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీరిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   3 Sep 2024 5:05 AM GMT
గబ్బర్ సింగ్ రీ రిలీజ్.. ఆలా జరిగిందా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీరిలీజ్ చేశారు. ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన ఆదరణ లభించింది. ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానుల నుంచి ఈ సినిమాకి అనూహ్య స్పందన వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే టికెట్స్ ని ముందుగా బుక్ చేసుకున్నారు. దీంతో 4 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే గబ్బర్ సింగ్ మూవీ అందుకుందనే మాట వినిపిస్తోంది.

రీరిలీజ్ ట్రెండ్ లో స్టార్ హీరోల సినిమాలకి ఫ్యాన్స్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సిఎం అయిన తర్వాత ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. మూడు సినిమాలు లైన్ అప్ లో ఉన్న అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయనేది క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ బర్త్ డే గిఫ్ట్ గా గబ్బర్ సింగ్ చిత్రాన్ని 4Kలో రీరిలీజ్ చేశారు. ఈ సినిమా రీరిలీజ్ పై ఎప్పటి నుంచి పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గబ్బర్ సింగ్ మూవీకి థియేటర్స్ లో ఫ్యాన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే హైదరాబాద్ లోనే ఓ ప్రముఖ థియేటర్ లో గబ్బర్ సింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల పెద్ద సంఖ్యలో చూసారు. నిజానికి ఈ థియేటర్ కెపాసిటీకి మించి టికెట్స్ అమ్మినట్లు టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్ ఇంటరెస్ట్ ని దృష్టిలో ఉంచుకొని టికెట్స్ పై స్కామ్ చేశారనే ప్రచారం నడుస్తోంది. ఈ థియేటర్స్ గబ్బర్ సింగ్ షో టైంలో విపరీతంగా క్రౌడ్ ఉన్నారు. నిజానికి థియేటర్ కెపాసిటీ 1300 అయితే ఏకంగా 2500 మందికి టికెట్స్ అమ్మినట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో థియేటర్స్ లో చాలా మందికి కూర్చోవడానికి కుర్చీలు కూడా దొరకలేదంట. థియేటర్స్ లో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అయిపోయారంట. థియేటర్స్ వారు బ్లాక్ టికెట్స్ అమ్ముకున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. హ్యాపీగా గబ్బర్ సింగ్ సినిమా చూద్దామని వెళ్లిన వారు చెమటలు కక్కుతూ బయటకొచ్చారంట.

నిబంధనలు ఫాలో అవ్వకుండా ఇష్టానుసారంగా టికెట్స్ అమ్మేసి ప్రేక్షకుల అభిమానాన్ని ఆదాయంగా మార్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి కేవలం హైదరాబాద్ లోనే ఉందా? లేదంటే రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని థియేటర్స్ లలో కూడా ఇలానే ఉందా అనే అనుమానం కలుగుతోంది. ఫ్యాన్స్ ఎలాగూ సీట్లలో కూర్చోకుండా స్క్రీన్ దగ్గరకు వెళ్లి హడావుడి చేస్తారు కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోరు.

అడిగేవాడు ఉండడు అనే కారణంగా లెక్కకు మించి ఆదాయం రాబట్టాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంతమంది జనంలో ఏదైనా జరగరానిది జరిగితే అదుపు చేయడం కూడా కష్టం. ఈ విషయంలో థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం ఓ వర్గం ఫ్యాన్స్ కు ఏమాత్రం నచ్చలేదు.