SSMB29.. తడిసి పోయేలా కొసరు ఖర్చు..?

ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా లాక్ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-05-18 04:02 GMT

ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా లాక్ చేసిన విషయం తెలిసిందే. ఆగష్టు నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికే తన లుక్ ని మార్చుకునే ప్రాసెస్ లో ఉన్నాడు. మహేష్ నటించిన 28 సినిమాల్లో ఎప్పుడు చూడని కొత్త మేకోవర్ ఈ సినిమా కోసం ట్రై చేస్తున్నారని తెలుస్తుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ తనను తాను ఫిట్ గా చేసుకుంటున్నాడు. కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.


సినిమా కథ రాసుకున్నప్పుడే రెండు భాగాలుగా ఫిక్స్ అయ్యారట. ఫస్ట్ పార్ట్ కోసం ఒక 200 కోట్లు సెకండ్ పార్ట్ కోసం మరో 200 నుంచి 300 కోట్లు ఖర్చు పెడతారని తెలుస్తుంది. మహేష్, రాజమౌళి ఇద్దరి రెమ్యునరేషన్ రెండు భాగాలకు కలిపి లెక్క వేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం రాజమౌళి, మహేష్ ఇద్దరు తక్కువలో తక్కువ 3 ఏళ్లు కష్టపడే అవకాశం ఉంది.

ఫస్ట్ పార్ట్ కోసం రెండేళ్లు ఆ తర్వాత మరో ఏడాది లేదా రెండేళ్లు టైం పడుతుంది. ఈ టైం లో అటు మహేష్ కూడా వేరే ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ లేదు. అందుకే వాటికి తగినట్టుగానే సినిమాకు మహేష్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. SSMB 29 సినిమాకు మహేష్ 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. అయితే డైరెక్టర్ గా రాజమౌళి కూడా హీరో కి ఏమాత్రం తక్కువ కాకుండా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది.

అయితే సినిమా కేవలం ప్రొడక్షన్ కాస్ట్ 300 కోట్లు అవుతుండగా రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్ ఇవన్నీ కలిపి ఎక్కువ అవుతున్నాయని తెలుస్తుంది. RRR లో నాటు నాటు సాంగ్ కోసమే ఆస్కార్ దాకా వెళ్లిన రాజమౌళి మహేష్ తో చేస్తున్న ఈ సినిమాను బెస్ట్ హీరో, బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్ రేసులో కూడా నామినేట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే మాత్రం కచ్చితంగా మరో అకాడమీ అవార్డు మహేష్ రాజమౌళి సినిమాకు వచ్చి తీరుతుందని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ టెక్నీషియన్స్ ని సైతం రంగంలోకి దించుతున్నాడు. కాబట్టి జక్కన్న ముందు నుంచే పర్ఫెక్ట్ కాలిక్యులేషన్స్ తో మహేష్ సినిమా చేస్తున్నాడని చెప్పొచ్చు.

Tags:    

Similar News