లేడీ డాన్ గా సీనియర్ బ్యూటీ!
నటిగా తానో బ్రాండ్ అని బాలీవుడ్ లో ఎప్పుడో ముద్ర వేసింది. హాలీవుడ్ లో సైతం అమ్మడు సత్తా చాటింది.
బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటి. యాక్షన్ , థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా ఇలా రకరకాల బ్యాక్ డ్రాప్ లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించింది. నటనతో విమర్శకుల ప్రశంసలందుకుంది. నటిగా తానో బ్రాండ్ అని బాలీవుడ్ లో ఎప్పుడో ముద్ర వేసింది. హాలీవుడ్ లో సైతం అమ్మడు సత్తా చాటింది.
పోషించింది చిన్న రోల్ అయినా? డెబ్యూతోనే ప్రశంసలందుకుంది. తాజాగా హ్యూమా ఖురేష్ మరో ప్రయోగానికి రెడీ అయింది. 'ఢిల్లీ క్రైమ్' సిరీస్ తో విలనీగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. 'ఢిల్లీ క్రైమ్' సిరీస్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సిరీస్ నుంచి థర్డ్ పార్ట్ మొదలవుతుంది. దీనిలో భాగంగా హ్యూమా ఖురేషీని విలన్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. రిచీ మెహతా విలన్ పాత్రకు హ్యూమా అంగీకరిస్తుందా? లేదా? అన్న సందేహంతోనే వెళ్లింది.
కానీ పాత్ర విన్న వెంటనే హ్యూమా ఒప్పుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో నేరస్తుల ఆకట్టించే డీసీపీ వర్తిక చతుర్వేదిని హ్యూమా ఢీ కొట్ట బోతుంది. ఆ రెండు పాత్రలు నువ్వా? నేనా? అన్న రేంజ్ లో సాగుతాయని సమాచారం. అంతే సహజంగానూ ఆ పాత్రలు ఉంటాయని సిరీస్ వర్గాలంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిజ జీవిత సంఘటనలు ఆధారంగా ఢిల్లీ క్రైమ్ మొదలైంది. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన రెండు భాగాలు మంచి విజయం సాధించాయి.
ఈ నేపథ్యంలో మూడవ భాగాన్ని తెరపైకి తెస్తున్నారు. షెపాలీ షా, రసికా దుగ్గల్, రాజేష్ తైలాంగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదే సిరీస్ లో మరికొంత మంది బాలీవుడ్ లో ఫేమస్ అయిన నటీనటులు, సింగర్లను కూడా భాగం చేయాలనుకుంటున్నారుట. ఆ వివరాలు త్వరలో బయటకు వస్తాయి. ఇంకా సిరీస్ లో చాలా మంది కొత్త వాళ్లు యాడ్ అవుతారని తెలుస్తోంది.