ఆది స్పీచ్.. అంచనాలు తప్పదంతే..!

అందుకే త్రివిక్రం కి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా ఆయన రాసే మాటలకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది

Update: 2024-10-28 13:15 GMT

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం చేసే సినిమాలే కాదు.. ఆయన డైలాగ్స్ అందించిన సినిమాలు కూడా ఆయన ప్రత్యేకతని చాటి చెప్పాయి. రచయితగా ఉన్నప్పటి నుంచి తన మార్క్ చాటుతూ వచ్చిన త్రివిక్రం డైరెక్టర్ గా మారాక తన కథలకు తన పదునైన మాటలతో ఆడియన్స్ ని అబ్బురపరుస్తున్నాడు. అందుకే త్రివిక్రం కి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా ఆయన రాసే మాటలకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.

అందుకే ఆయన్ని మాటల మాంత్రికుడు అని స్పెసిఫిక్ గా చెబుతుంటారు. ఐతే అలాంటి త్రివిక్రం ని తన మాటలతో మ్యాజిక్ చేయాలంటే మాత్రం అది హైపర్ ఆదినే అయ్యుండాలి అనిపించేలా లక్కీ భాస్కర్ ఈవెంట్ లో తన స్పీచ్ తో అదరగొట్టాడు హైపర్ ఆది. జబర్దస్త్ క్రేజ్ తో సినిమాల్లో కమెడియన్ గా రాణిస్తున్న ఆది ఇలా తను పనిచేసిన సినిమాల ఈవెంట్స్ కు తన స్పీచ్ తో స్పెషల్ క్రేజ్ తెస్తున్నాడు. లక్కీ భాస్కర్ ఈవెంట్ కి త్రివిక్రం అతిథిగా రాగా ఆయన గురించి తన మనసులో దాచుకున్న అన్ని విషయాలను బయట పెట్టేశాడు ఆది.

ముఖ్యంగా తన కాలేజ్ డేస్ లో తన ల్యాప్ టాప్ లో కేవలం త్రివిక్రం సినిమాలు డైలాగ్స్ ఉండేవని చెప్పిన ఆది త్రివిక్రం ఒక్కో సినిమాలోని ఒక్కో డైలాగ్ తో ఆయన్ను ఆకట్టుకున్నాడు. చివర్లో రైటింగ్ విషయానికి వస్తే తెలుగు సినిమా అంటే త్రివిక్రం ముందు త్రివిక్రం తర్వాత అని చెప్పాడు హైపర్ ఆది. గురూజీ గురించి హైపర్ ఆది చెప్పిన దానిలో అతిశయోక్తి అన్నది ఏది లేదు.. ఆయన మాటలతో కేవలం ఎమోషనల్ మాత్రమే కాదు కంటికి కనిపించని మనిషితో బయటకు కనిపించని యుద్ధం చేస్తాడు ప్రేక్షకుడు.

ఆదికి మైక్ ఇస్తే ఎలాంటి స్పీచ్ ఇస్తాడని ఆశిస్తారో దానికి ఏమాత్రం తగ్గకుండా ఆది స్పీచ్ ఉంటుంది. ఇంకా తనకు నచ్చిన వారి గురించి అయితే ఆది తన టాలెంట్ మొత్తం వాడుతుంటాడు. త్రివిక్రం ని మాత్రమే కాదు సినిమా ఈవెంట్ కి వచ్చిన విజయ్ దేవరకొండ గురించి కూడా హైపర్ ఆది తన మాటలతో ఇంప్రెస్ చేశాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారి మీద చాలామంది ఏడుపు ఉంటుందని ఇన్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండని చూసి ఏడ్చే వారికి తన మార్క్ పంచ్ వేశాడు ఆది.

జబర్దస్త్ లో పంచ్ డైలాగ్స్ రాసి రాసి.. మైక్ అందుకోగానే ఆదికి అలా ప్రాసలు, పంచులు వస్తుంటాయి. ఈ మధ్య ఈవెంట్స్ లో ఆది ఇస్తున్న స్పీచ్ ఫ్యాన్స్ కి మంచి జోష్ ఇస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News