అమీర్ కొడుకు తేలిపోయాడు.. సైఫ్ కొడుకు నిరూపిస్తాడా?

సైఫ్ అలీ ఖాన్ -అమృతా సింగ్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ `నాదానియన్` చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీలో ఖుషీ కపూర్ క‌థానాయిక‌.

Update: 2025-02-16 09:28 GMT

సైఫ్ అలీ ఖాన్ -అమృతా సింగ్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ `నాదానియన్` చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీలో ఖుషీ కపూర్ క‌థానాయిక‌. తొలుత‌ ఈ చిత్రం అధికారికంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని ప్రకటించారు. కానీ విడుదల తేదీని వెల్లడించలేదు. ఇప్పుడు ఈ చిత్రం ఫిబ్రవరిలోనే విడుదల కానుందని తెలుస్తోంది.

తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో ఈ విష‌యాన్ని ధృవీక‌రించింది. నెక్ట్స్ రాబోయే చిత్రం నాదానియాన్ ఫిబ్ర‌వ‌రి 2025లోనే.. అని వెల్ల‌డించింది. ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్ ఇప్పటికే ప్రమోషన్లను ప్రారంభించారు. ఫిబ్ర‌వ‌రి 14న‌ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఖుషీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇబ్ర‌హీంతో క‌లిసి ఉన్న ఫోటోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. ఈ జంట రొమాంటిక్ పోస్ట‌ర్లు ఆక‌ట్టుకున్నాయి.

నాదానియన్ చిత్రాన్ని ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ లో క‌ర‌ణ్ జోహార్ నిర్మించారు. షౌనా గౌతమ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఈ రొమాంటిక్ డ్రామా క‌థాంశం యువ‌త‌రం మెచ్చే ల‌వ్ డ్రామాతో ఆక‌ట్టుకుంటుంద‌ని స‌మాచారం. ఒక అపార్థం తన స్నేహితులను విరోధులుగా మార్చిన‌ప్పుడు.. ల‌వ్ కోసం ధనవంతురాలైన పియా తన ప్రియుడిగా నటించడానికి కెరీర్ నే జీవితంగా భావించే కొత్త విద్యార్థి అర్జున్‌ను నియమించుకుంటుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌దే ఈ సినిమా.

నాదానియన్ సినిమా మొదటి పోస్టర్ లో ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్ ఒకరినొకరు కౌగిలించుకుని క‌నిపించారు. ప్రతి ప్రేమకథలో థోడి సి నాదానీ (కొంచెం మూర్ఖత్వం) ఉంటుంది! అనే క్యాప్షన్ ఆక‌ట్టుకుంది. ఈ సినిమా నుంచి పాటలు ఇప్ప‌టికే విడుద‌ల కాగా యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకున్నాయి. ఖుషి క‌పూర్ ఇటీవ‌లే అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ స‌ర‌స‌న ల‌వ్ యాపా చిత్రంలో న‌టించింది. ఈ సినిమా ఆశించిన వ‌సూళ్ల‌ను సాధించలేదు. అమీర్ కొడుకు జ‌నాల్ని ఆక‌ర్షించ‌డంలో ఫెయిల్ అయ్యాడు.. సైఫ్ కొడుకు నిరూపిస్తాడా లేదా? అన్న‌ది ఇప్ప‌టికి సస్పెన్స్. నెట్ ఫ్లిక్స్ లో నాదానియాన్ ఏమేర‌కు ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News