నన్ను నేను `సూపర్‌స్టార్`గా భావించను!
ఇటీవలి ఇంటర్వ్యూలో సల్మాన్ తాను ఎప్పుడూ సూపర్‌స్టార్ ని అని భావించలేదని, 25 ఏళ్లుగా బయటికి డిన్నర్‌కు వెళ్లలేదని కూడా తెలిపాడు.
సల్మాన్ ఖాన్ `మైనే ప్యార్ కియా`(1989)లో హీరోగా కనిపించాడు. తొలి విజయంతోనే అతడు సూపర్ స్టార్‌గా మారాడు. అయినప్పటికీ తాను `సూపర్‌స్టార్` అయ్యానని అనుకోలేదట. ఇటీవలి ఇంటర్వ్యూలో సల్మాన్ తాను ఎప్పుడూ సూపర్‌స్టార్ ని అని భావించలేదని, 25 ఏళ్లుగా బయటికి డిన్నర్‌కు వెళ్లలేదని కూడా తెలిపాడు.
ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ -``నేను 25-26 సంవత్సరాలుగా ఇంటి నుండి బయటకు డిన్నర్‌కి వెళ్లలేదు. షూట్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే ప్రయాణిస్తాను. నేను నా లాన్‌లో కూర్చున్నప్పుడు లేదా నేను పొలానికి వెళ్లినప్పుడు మాత్రమే బహిరంగంగా కనిపిస్తాను. నా ప్రయాణం ఇల్లు, షూట్, హోటల్, విమానాశ్రయం, లొకేషన్, తిరిగి ఇంటికి ఆపై జిమ్‌కి. అంతే`` అని కూడా తెలిపాడు.
సల్మాన్ తన కుటుంబం కంటే తన సిబ్బందితో ఎక్కువ సమయం గడుపుతానని, తాను షాపింగ్ చేయడానికి కూడా వెళ్లనని చెప్పాడు. తాను అమ్మతో ఉన్నప్పుడు మాత్రమే బయటకు వెళ్లేవాడినని, కాఫీ తాగేందుకు వెళ్లేవాళ్లమని చెప్పారు. బహుశా అమ్మ నాతో ఉన్నప్పుడు నేను బయటకు వెళ్లడానికి చాలా ఇష్టపడతాను. మేము కాఫీ తాగడానికి దగ్గరగా ఉన్న రెస్టారెంట్‌కి లేదా ఇంకెక్కడికైనా బయలుదేరుతాము`` అని అన్నాడు. హిందీ చిత్ర పరిశ్రమలోని సూపర్‌స్టార్‌లలో ఒకరిగా ఫాలోయింగ్ ఉన్న సల్మాన్ తాను ఎప్పుడూ సూపర్‌స్టార్ అని భావించలేదని.. తన అలవాట్లు సూపర్‌స్టార్ లాగా ఉండవు అని చెప్పాడు. నేను ప్రయాణించే విధానం, వేసుకునే దుస్తులు, చేసేది ఏదీ సూపర్‌స్టార్‌ని అని చెప్పలేవు. నా మనసు అలా శ్రుతిమించదు. నా గురించి ఏదీ సూపర్‌స్టారీ ఎఫైర్ కాదు`` అన్నాడు.
సల్మాన్ ఖాన్ సూపర్ స్టార్ అని నేను అనుకోను. ఇది అన్నిరకాలుగా బుల్ షిట్. నేను ఎప్పుడూ స్టార్ డమ్ ని అనుభూతి చెందలేదు. నేను ఉదయాన్నే నిద్రలేచి, కాఫీ తాగి, నా రోజువారీ వ్యాపకాన్ని ప్రారంభించినందుకు సంతోషిస్తాను.. నేను నా బెస్ట్ ఇవ్వాలనుకుంటాను అని తెలిపాడు. సల్మాన్ ఖాన్ ఇప్పుడు సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో తన తదుపరి చిత్రంలో నటించాల్సి ఉంది.