ప్రేక్షకులను థ్రిల్ చేయడంలోనే సక్సెస్ మంత్రం..!
ఐతే ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం అంత తేలికైన విషయం కాదు.
హిట్ సినిమాకు సక్సెస్ మంత్రం ఏంటి అంటే ఈమధ్య కొన్ని సినిమాలు ప్రత్యేకమైన డెఫినేషన్ ఇస్తున్నారు. టికెట్ కొనే ఆడియన్ సాటిస్ఫై అయితేనే ఎంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా అయినా.. లేదా లో బడ్జెట్ లో తెరకెక్కించిన సినిమా అయినా సక్సెస్ అవుతుంది. ఐతే ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం అంత తేలికైన విషయం కాదు. కానీ దానికి ఈమధ్య మేకర్స్ తమ కొత్త పంథాను కొనసాగిస్తున్నారు.
కథ కథనాలు ఎలా ఉంటాయన్నది టీజర్, ట్రైలర్ లో కొంత శాంపిల్ చూపిస్తున్నా సరే సినిమా సూపర్ అనేలా టాక్ రావాలి అంటే మాత్రం ఊహించని ట్విస్ట్ ఒకటి ఉండాల్సిందే. ట్విస్టులు, టర్న్ లు అవి ఆడియన్స్ ని ఎంత మెస్మరైజ్ చేస్తాయో అంత సూపర్ హిట్ అనిపించేస్తున్నాయి. ఈమధ్య వచ్చే సినిమాలు ఇలాంటి పంథానే కొనసాగిస్తున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం అందని ట్విస్ట్ లు, లేదా మైండ్ బ్లాక్ అయ్యే టర్న్ లు ఇస్తే తప్ప వావ్ అని అనిపించట్లేదు.
అందుకే సినిమా కథకు తగినట్టుగా తగినంత సర్ ప్రైజ్ ట్విస్ట్ లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈమధ్య ఎక్కువ సినిమాలు థ్రిల్లర్, సస్పెన్స్ జోనర్ లో వస్తున్నాయి. రెగ్యులర్ కాన్సెప్ట్ సినిమానే అనిపించేలా ట్రైలర్ వదలడం తీరా సినిమా చూశాక అదిరిపోయే ట్విస్ట్ తో మెస్మరైజ్ చేయడం మేకర్స్ వంతు అవుతుంది. ఈ స్క్రీన్ ప్లే ఆడియన్స్ కు మంచి మజా అందిస్తుంది.
సినిమా సక్సెస్ కు అదే ఒక మంత్రంగా పనిచేస్తుంది. సినిమాలో ఏదో ఉంది అనే ఆడియన్స్ మైండ్ సెట్ ని సిద్ధం చేసి వారు ఊహించని ఒక ట్విస్ట్ అందిస్తే చాలు సినిమా ప్రేక్షకులకు ఎక్కేసినట్టే. అందుకే కథలో ట్విస్ట్ లు, టర్న్ లు ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
స్టార్ సినిమాల్లో కూడా ఇలాంటి మ్యాజిక్ లు ఉంటున్నా ఈ రకమైన పంథా చిన్న సినిమాలకు ఎక్కువ వర్క్ అవుట్ అవుతుంది. ట్విస్ట్ లతో పాటు సినిమా సక్సెస్ కు క్లైమాక్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. క్లైమాక్స్ ఊహించని షాక్ ఇస్తే థియేటర్ నుంచి బయటకు వెళ్లే ఆడియన్ కు సంతృప్తిగా ఉంటుందని కూడా అలా ప్లాన్ చేస్తున్నారు.