ప్లాప్ అయినా డేర్ గా దిగేస్తున్నారే!
నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే చిత్రమని బలమైన నమ్మకంతోం అల్లు అరవింద్ అక్కడ నిర్మించారు.
కొంత కాలంగా బాలీవుడ్ లో టాలీవుడ్ రీమేక్ లు పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. 'అర్జున్ రెడ్డి' ..'కబీర్ సింగ్' రీమేక్ అయి మంచి విజయం సాధించిన తర్వాత ఇంకొన్ని తెలుగు సినిమాలు రీమేక్ అయ్యాయి కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. 'జెర్సీ' చిత్రాన్ని ఇదే టైటిల్ తో గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్ లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే చిత్రమని బలమైన నమ్మకంతోం అల్లు అరవింద్ అక్కడ నిర్మించారు. కానీ అంచనాలు తారుమారయ్యాయి.
అటుపై బన్నీ నటించిన 'అలవైంకుఠపుములో' చిత్రాన్ని హిందీలో 'షెహజాదే 'టైటిల్ తో రీమేక్ అయిం ది. రోహిత్ ధావన్ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్..కృతి సనన్ జంటగా నటించిన సినిమా పెట్టుబడి కూడా తేలేదు. 60 కోట్ల బడ్జెట్ తో నిర్మాణమైన సినిమా 40 కోట్ల వసూళ్లే సాధించింది. అలా తెలుగు కంటెంట్ బాలీవుడ్ లో ఆశించిన ఫలితాలు సాధించలేదు. అయితే ఇక్కడ హిట్ సినిమా అక్కడెందుకు ఆడలేదు? అన్న సందేహం సహజమే. కంటెంట్ వైఫల్యంతో బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయా? మేకింగ్ వైఫల్యామా? అన్నది అర్దంకాని ప్రశ్న.
అయినా తగ్గేదేలే అంటూ మరో రెండు టాలీవుడ్ చిత్రాలు రీమేక్ కి రెడీ అవుతున్నాయి. అవి 'బేబి'... 'ఉప్పెన'. 'బేబి' ఇక్కడ 90 కోట్లకు పైగావ సూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. కల్డ్ బొమ్మ టైటిల్ తో హిందీలో రీమేక్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో ఎవరు నటిస్తున్నారు? అన్నది ఇంకా కన్పమ్ కాలేదు. అలాగే బుచ్చిబాబు 'ఉప్పెన' చిత్రాన్ని బోనీకపూర్ రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. తన చిన్న కుమార్తె ఖుషీ కపూర్ నే హీరోయిన్ గా పెట్టి తీయాలని చూస్తున్నారు.
ఆ సినిమా చూడమని ఇప్పటికే కుమార్తెకి చెప్పినట్లు చెప్పారు. అయితే హీరో ఎవరు? దర్శకుడు ఎవరు? అన్నది తెలియాల్సిన అంశం. బాలీవుడ్ లో గత రీమేక్ ల పరాజయాల్ని పట్టించుకోకుండా నిర్మాతలు అక్కడ రీమేక్ కి రెడీ అవుతున్నారు. మరి వీటి విజయాలు తెలుగు రీమేక్ ల సెంటిమెంట్ ని తిరగరాస్తా యేమో చూడాలి.