IIFA ఉత్సవం 2024: తారా తోరణంతో కన్నుల పండుగ
ప్రఖ్యాత ఫిల్మ్ అవార్డ్ వేడుక IIFA ఉత్సవం 2024 కోసం దుబాయిలోని ఎతిహాద్ అరేనా గత రాత్రి వైభవంగా మారింది.
దుబాయ్ వేదికగా సాగిన ఐఫా 2024 అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా సాగింది. ఈ వేదికపై తారాతోరణం గ్లామ్ అండ్ గ్లిప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రఖ్యాత ఫిల్మ్ అవార్డ్ వేడుక IIFA ఉత్సవం 2024 కోసం దుబాయిలోని ఎతిహాద్ అరేనా గత రాత్రి వైభవంగా మారింది.
టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఈ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఇదే వేదిక వద్ద మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ తన కుమార్తె ఆరాధ్య తో కలిసి కనిపించారు. ఏఆర్ రెహమాన్, విక్రమ్, మణిరత్నం, నాని, సుహాసిని, రాశి ఖన్నా, రకుల్ ప్రీత్, సమంత, కృతి సనన్ తదితరులు ఈ అవార్డు వేడుకలో పాల్గొన్నారు.
సంవత్సరంలో అతిపెద్ద ఈవెంట్ ఉత్సాహం నింపింది. అబుదాబిలో శుక్రవారం (సెప్టెంబర్ 27) నాడు ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA) 24వ ఎడిషన్ కోసం సౌత్ - బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన అందర్నీ ఒకే తాటిపైకి తీసుకురావడం గ్లామర్ ని పెంచింది. IIFA ఉత్సవం 2024 వేదికపై విజేతలకు పురస్కారాలు అందించారు. సమంతా రూత్ ప్రభు ఈ వేదికపై ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2024 పురస్కారాన్ని గెలుచుకుంది.
ఐఫా 2024 విజేతల పూర్తి జాబితా:
ఉత్తమ చిత్రం (తమిళం): జైలర్
ఉత్తమ నటుడు (తెలుగు): నాని (దసరా)
ఉత్తమ నటుడు (తమిళం): విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్: II)
ఉత్తమ నటి (తమిళం): ఐశ్వర్య రాయ్ (పొన్నియిన్ సెల్వన్: II)
ఉత్తమ దర్శకుడు (తమిళం): మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్: II)
ఉత్తమ సంగీత దర్శకత్వం (తమిళం): , AR రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్: II)
భారతీయ సినిమాలో అత్యద్భుతమైన విజయం: చిరంజీవి
భారతీయ సినిమాకు అత్యుత్తమ సహకారం: ప్రియదర్శన్
ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఇండియన్ సినిమా: సమంత రూత్ ప్రభు
ప్రతినాయకుడి పాత్రలో ఉత్తమ ప్రదర్శన (తమిళం): SJ సూర్య (మార్క్ ఆంటోని)
ప్రతినాయకుడి పాత్రలో ఉత్తమ ప్రదర్శన (తెలుగు): షైన్ టామ్ చాకో (దసరా)
ప్రతినాయకుడి పాత్రలో ఉత్తమ ప్రదర్శన (మలయాళం): అర్జున్ రాధాకృష్ణన్ (కన్నూర్ స్క్వాడ్)
సహాయక పాత్రలో ఉత్తమ ప్రదర్శన (పురుషుడు - తమిళం): జయరామ్ (పొన్నియిన్ సెల్వన్: II)
సహాయక పాత్రలో ఉత్తమ ప్రదర్శన (మహిళ - తమిళం): సహస్ర శ్రీ (చిత్త)
గోల్డెన్ లెగసీ అవార్డు: నందమూరి బాలకృష్ణ
కన్నడ సినిమాలో అత్యుత్తమ ప్రతిభ: రిషబ్ శెట్టి
బెస్ట్ డెబ్యూ (మహిళ - కన్నడ): ఆరాధనా రామ్ (కాటెరా)
IIFA లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి దక్షిణాది పరిశ్రమలకు సంబంధించిన అవార్డుల ఉత్సవం. మూడు రోజుల వేడుక ప్రారంభమైంది. రెండవ రోజు, IIFA అవార్డ్స్ నైట్‌లో షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్, కరణ్ జోహార్ సహా తారలు ప్రేక్షకులను అలరించనున్నారు. రేఖ కూడా చాలా గ్యాప్ తర్వాత IIFA లో పాల్గొంటున్నారు.