సెట్లో మహిళలతో దుష్ప్రవర్తన.. ముగ్గురిని తొలగించానన్న దర్శకుడు!
గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ సినిమా పండుగ (IFFI) నుంచి రకరకాల అప్ డేట్స్ ప్రజల్లో హాట్ టాపిగ్ గా మారుతున్నాయి.
గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ సినిమా పండుగ (IFFI) నుంచి రకరకాల అప్ డేట్స్ ప్రజల్లో హాట్ టాపిగ్ గా మారుతున్నాయి. ఇఫీ -2024 వేదికగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అలాంటి ఒక వ్యాఖ్యతో ప్రఖ్యాత ఫిలింమేకర్ ఇంతియాజ్ అలీ మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చారు. భూమి పెడ్నేకర్, వాణీ త్రిపాఠి తదితరులతో కలిసి మహిళల భద్రత, సినిమాపై చర్చా కార్యక్రమంలో ఇంతియాజ్ అనర్గళంగా మాట్లాడారు. చర్చా వేదిక సందర్భంగా ఇంతియాజ్ వ్యాఖ్యానిస్తూ... దురదృష్ట ఘటన కారణంగా అలియా భట్ నటించిన `హైవే` సెట్ నుండి ఒక మగ సిబ్బందిని తొలగించాల్సి వచ్చిందని మీడియాలో కథనాలొచ్చాయి కానీ.. హైవే సెట్‌లో ఎలాంటి ఇబ్బందికర ఘటనా జరగలేదని, యూనిట్ నుంచి ఎవరినీ తొలగించలేదని ఇంతియాజ్ అలీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు.
ఇంతియాజ్ తన తాజా ఇన్‌స్టా కథనంలో స్పష్ఠతనిస్తూ... ఒక క్రూ మెంబర్‌ను దుష్ప్రవర్తన కారణంగా ఇంటికి పంపినట్లు పేర్కొన్న ఒక స్క్రీన్ షాట్ ని చూపిస్తూ.. `హైవే` సినిమా సెట్స్‌లో ఎలాంటి దురదృష్టకర ఘటనా జరగలేదు.. ఆ యూనిట్ నుండి ఎవరినీ వెనక్కి పంపలేదు. హైవే యూనిట్ సమస్యలు లేనిది! అని వ్యాఖ్యానించారు.
ప్యానెల్ డిస్కషన్ సందర్భంగా గీత దాటినప్పుడు చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుంది? అని ప్రశ్నించగా, ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ ``నా జీవితంలో నేను ముగ్గురిని తొలగించాను..వేర్వేరు సెట్లలోని భిన్నమైన వ్యక్తులు వీరంతా. కేవలం మగ్గురు మాత్రమేనని నేను సంతోషిస్తున్నాను..అయితే `హైవే` సెట్స్‌లో అలా జరగలేదని స్పష్టం చేశాడు. సంభాషణ సమయంలో ఇంతియాజ్ అలీ ఇలా అన్నారు. ``మేం హైవే అనే సినిమా చేసాము. ఆ సమయంలో సరైన వ్యానిటీ వ్యాన్లు లేకుండా నిరంతరం రోడ్డుపైనే మేమంతా ఉన్నాము. ప్రకృతి పిలుపు కోసం లేదా దుస్తులు మార్చుకోవడానికి కూడా. అలియాను అసాధారణ ప్రదేశాలకు తీసుకెళ్లాల్సి వచ్చింది. కొన్నిసార్లు కెమెరామెన్, లేదా నేను లేదా రణదీప్ హుడా ఆమెకు సురక్షితమైన స్థలాన్ని ఇవ్వడానికి ఎవరికీ సాధ్యం కాని కొన్ని ప్రదేశాలలో మేం ఉన్నాం`` అని చెప్పాడు. తన కెరీర్ లో మూడు సందర్భాల్లో మాత్రం దురదృష్టకర సంఘటనలు జరగగా ఆ వ్యక్తులను తొలగించామని ఇంతియాజ్ అన్నారు.
అయితే కాలం చాలా మారిపోయిందని నటీమణులు ఇప్పుడు సెట్స్‌లో నిజంగా సురక్షితంగా ఉన్నారని ఆయన అన్నారు. బొంబాయిలోని చిత్ర పరిశ్రమ మహిళల విషయంలో ప్రవర్తించే విధానం గొప్పది. ఒక యూనిట్‌లో 200 మంది పనిచేస్తున్నందున వారికి ఇది చాలా సురక్షితమైన చోటు అని కూడా వ్యాఖ్యానించారు.
అయితే పరిశ్రమలో ఇలాంటి తెలియని విషయాలను ఇంతియాజ్ అలీ మాట్లాడాల్సింది కాదని బాలీవుడ్ నిర్మాత వింతా నందా విమర్శించారు. తెలియని విషయాలను అతడు మాట్లాడకూడదు. పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని ఆయన గుర్తించాలి... అని విమర్శించారు.