భారతదేశంలో పారితోషికంలో నంబర్-1 హీరో
అయితే ఇప్పుడు అతడిని వెనక్కి నెడుతూ అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల పారితోషికంతో భారతదేశంలోనే నంబర్ వన్ స్టార్ గా రికార్డులకెక్కాడని ప్రఖ్యాత ఫోర్బ్స్ 2024 తాజా ప్రకటనలో వెల్లడించింది.
'లియో' విడుదల సమయంలో పారితోషికం పరంగా భారతదేశంలో నంబర్ వన్ హీరో దళపతి విజయ్ అంటూ ప్రచారమైంది. అతడు లియో చిత్రానికి 275 కోట్లు అందుకున్నాడని మీడియాలో కథనాలు రాగా ఆశ్చర్యపరిచాయి. అయితే ఇప్పుడు అతడిని వెనక్కి నెడుతూ అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల పారితోషికంతో భారతదేశంలోనే నంబర్ వన్ స్టార్ గా రికార్డులకెక్కాడని ప్రఖ్యాత ఫోర్బ్స్ 2024 తాజా ప్రకటనలో వెల్లడించింది. దీంతో అల్లు అర్జున్ నం1 గా, దళపతి విజయ్ నం.2 స్టార్ గా రికార్డులకెక్కారు.
ఆ తర్వాతి 8 స్థానాల్లో షారూఖ్, రజనీకాంత్, అమీర్ ఖాన్, ప్రభాస్, అజిత్, సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లు ఉన్నారు. షారూఖ్ ఖాన్ 150-250 కోట్ల మధ్య అందుకుంటూ మూడో స్థానంలో నిలవగా, రజనీకాంత్, అమీర్ ఖాన్ 150 కోట్ల నుంచి 240 కోట్లు అందుకునే స్టార్లుగా రికార్డులకెక్కారు. 100 నుండి 200 కోట్లు అందుకుంటున్న హీరోగా ప్రభాస్ రికార్డుల్లో ఉన్నాడు. తళా అజిత్ కుమార్ 105 నుండి 165 కోట్లు అందుకుంటున్నాడు. సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ 100 నుండి 150 కోట్లు అందుకునే స్టార్లు కాగా, అక్షయ్ కుమార్: 60-145 కోట్లు అందుకుంటున్నాడు. ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం అల్లు అర్జున్ ఇప్పటికి నంబర్ వన్ గా డిక్లేర్ అయ్యాడు. టాప్ 10లో తెలుగు నుంచి అల్లు అర్జున్, ప్రభాస్ రికార్డులకెక్కగా, సౌత్ నుంచి మొత్తం ఆరుగురు రికార్డులకెక్కారు.
'పుష్ప 2' డిసెంబర్ 5న విడుదలకు రానుండగా అల్లు అర్జున్ మానియా దేశాన్ని ఊపేస్తోంది. పుష్పరాజ్ నుంచి అసాధారణమైన పెర్ఫామెన్స్ ని ఉత్తరాది అభిమానులు ఆశిస్తున్నారు. వారు ఆశించినది తెరపై కనిపిస్తే కచ్ఛితంగా పుష్ప2 ఇప్పటివరకూ ఉన్న చాలా రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. 'పుష్ప' చిత్రంతో బన్ని పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. అతడు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు.