ట్రాన్స్ జెండర్ గా టాలెంటెడ్ హీరో... !

హిట్‌ ఫ్లాప్ అని చూడకుండా మంచి సబ్జెక్ట్ లతో సినిమాలను చేయడం ద్వారా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటూ ఉన్నాడు.

Update: 2024-06-03 06:59 GMT

ట్యాలెంటెడ్‌ హీరో శ్రీ విష్ణు ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హిట్‌ ఫ్లాప్ అని చూడకుండా మంచి సబ్జెక్ట్ లతో సినిమాలను చేయడం ద్వారా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటూ ఉన్నాడు. ప్రతి సినిమాలో కూడా విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు.

శ్రీ విష్ణు హీరోగా ప్రస్తుతం స్వాగ్‌ అనే సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. గతంలో శ్రీవిష్ణు రాజా రాజా చోర సినిమాను చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా దర్శకుడు హషిత్‌ గోలీ దర్శకత్వంలోనే ప్రస్తుతం స్వాగ్‌ రూపొందుతున్న విషయం తెల్సిందే.

స్వాగ్‌ లో శ్రీ విష్ణు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 గెటప్స్ లో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రచారం ఆ 14 లో ఒకటి ట్రాన్స్ జెండర్‌ గెటప్ కూడా ఉంటుందట.

ప్రస్తుత హీరోల్లో ఏ ఒక్కరు కూడా ట్రాన్స్ జెండర్‌ గా కనిపించేందుకు ఆసక్తి చూపించరు. ముఖ్యంగా తెలుగు హీరోలు ఇమేజ్ అంటూ వామ్మో ట్రాన్స్ జెండర్ పాత్రనా... గెటప్‌ నా అంటూ చీదరించుకుంటారు. అలాంటిది శ్రీ విష్ణు ఆ గెటప్ కు ఓకే చెప్పడం షాకింగ్‌ విషయం.

రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మీరా జాస్మిన్‌ కీలక పాత్రలో నటిస్తూ రీ ఎంట్రీకి సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ముందు ముందు ఈ సినిమా గురించి మరింతగా హైప్‌ వచ్చే విషయాలు యూనిట్‌ సభ్యులు చెప్పబోతున్నారట.

Tags:    

Similar News