హాలీవుడ్ సినిమాతో మనోళ్ళ రికార్డ్

సాధారణంగా రీ-రిలీజ్ సినిమాలకు మంచి ఆదరణ ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌స్టెల్లార్ కు వచ్చిన స్థాయి మాత్రం వేరే లెవెల్.

Update: 2025-02-15 06:30 GMT

ప్రసాద్ ఐమ్యాక్స్‌లో రీ రిలీజ్ లోనే ఓ రికార్డు బద్దలైంది. కానీ, ఆ రికార్డు ఒక తెలుగు సినిమాకు సంబంధించినది కాదు. మనం ఎప్పుడూ ఊహించని విధంగా, ఈ అరుదైన ఘనతను సాధించింది హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ మాస్టర్‌పీస్ ఇంటర్‌స్టెల్లార్. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ 10 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా రీరిలీజ్ లో వచ్చింది. అద్భుతమైన విజువల్స్, కంటెంట్ ఉన్న కథనంతో ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది.

సాధారణంగా రీ-రిలీజ్ సినిమాలకు మంచి ఆదరణ ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌స్టెల్లార్ కు వచ్చిన స్థాయి మాత్రం వేరే లెవెల్. ప్రత్యేకంగా హైదరాబాద్‌లో అయితే సీన్ మొత్తం మారిపోయింది. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రదర్శించబడింది. ఈ థియేటర్ మన తెలుగు సినిమాలకు, బిగ్ బడ్జెట్ హాలీవుడ్ సినిమాలకు హబ్‌గా నిలుస్తోంది. అయితే, ఇంతవరకు ఎవరూ ఊహించని విధంగా, ప్రసాద్ మల్టీప్లెక్స్ రీ-రిలీజ్ లో ఓ అన్‌బ్రేకబుల్ రికార్డు క్రియేట్ చేసింది ఇంటర్‌స్టెల్లార్.

ఈ సినిమా ప్రసాద్ ఐమ్యాక్స్‌లో మొత్తం 50 షోలకు ప్లాన్ చేశారు. కానీ ఆశించిన దానికంటే రెస్పాన్స్ విపరీతంగా రావడంతో 99.9% ఆక్యుపెన్సీతో అన్ని షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఆరు రోజుల కలెక్షన్ల లెక్క ప్రకారం, మొత్తం 25,242 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. గ్రాస్ కలెక్షన్ ₹74,46,390 రూపాయలకు చేరుకుంది. ఇప్పటివరకు ఎలాంటి రీ-రిలీజ్ లో ఇటువంటి ఫీట్ సాధించలేదు.

సాధారణంగా ఒక తెలుగు సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు ఓ హాలీవుడ్ సినిమా రీ-రిలీజ్ లో రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. తెలుగు ప్రేక్షకులు సినిమా పట్ల చూపించే ప్రేమ మరోసారి ప్రపంచానికి తెలిసింది. మనం ఎంతగా తమ పరిశ్రమను ప్రేమిస్తున్నామో, అంతే స్థాయిలో గుడ్ సినిమాను ప్రోత్సహించేందుకు వెనకాడం లేదని నిరూపించామని చెప్పొచ్చు.

తెలుగు సినిమాల్లోనూ రీ-రిలీజ్ కలెక్షన్ల విషయంలో మంచి ట్రెండ్ ఉంది. ఘిల్లీ, ఆరెంజ్, ఖుషి వంటి సినిమాలు రీ-రిలీజ్ లో మంచి వసూళ్లు సాధించాయి. అయితే, ఇంటర్‌స్టెల్లార్ సాధించిన రికార్డును బద్దలు కొట్టే సినిమా మన ఇండస్ట్రీలో ఎప్పుడొస్తుందో చూడాలి. ఇంతకీ, ఈ రికార్డు ఎవరిదో కాదు, మన తెలుగు ప్రేక్షకులదే. హాలీవుడ్ సినిమా అయినా మనం దానికి చూపించిన ఆదరణకే ఇంతటి రికార్డు సాధ్యమైంది. రాబోయే రోజుల్లో మరో సినిమా ఈ రికార్డు బద్దలు కొడుతుందా? లేక ఇంటర్‌స్టెల్లార్ కొనసాగిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News