షెడ్ లో దాచి బెల్ట్..కర్రలతో దాడి!
రేణుస్వామి హత్యకేసులో కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
రేణుస్వామి హత్యకేసులో కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అనంతరం ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో నిర్ఘాంతపోయే సంగతులు తెలుస్తున్నాయి. రేణు స్వామిని దారుణంగా కొట్టాలని నటి పవిత్ర దర్శన్ ని ఉసిగొల్పినట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిలో భాగంగా దర్శన్ అభిమాన సంఘాల నాయకుడు రాఘవేంద్రరావు ఇందులోకి దిగినట్లు తెలుస్తోంది.
రాఘవేంద్ర తన భర్త రేణుస్వాని ఇంటి సమీపంలో వాహనం ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు రేణుస్వామి భార్య చెబుతుంది. `అటుపై బెంగుళూరు సమీపంలోని ఓ షెడ్ లోకి తీసుకెళ్లి దాచిపెట్టారు. కక్షతో కర్రలతో, బెల్డ్ లో ఒక్కడినే చేసి బాదారు. తీవ్రగాయాల పాలు కావడంతో పాటు కర్రలతో కొట్టడంతో ఎముకలు విరిగాయి .దీంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అటుపై మృతదేహాన్ని మురికి కాలువలో పడేసారు.
ఆ మృతదేహాన్ని వీధి కుక్కలు తినడం చూసి పుడ్ డెలివరీ బోయ్ పోలీసులకు సమాచారం అందించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈకేసులో దర్శన్, పవిత్రో పాటు మరో పదిమందిని కూడా అదుపులోకి తీసుకు న్న సంగతి తెలిసిందే. దర్శన్ అరెస్ట్ అవ్వడానికి ముందే హత్యలో అనుమానితులుగా ఉన్న వారందర్నీ పోలీసులు అరెస్ట్ చేసారు. వీళ్లందర్నీ బుధవారమే ఘటనా స్థలికి తీసుకెళ్లి సీన్ రీ కన్ స్ట్రక్ట్ చేసినట్లు చేసారు.
సోషల్ మీడియాలో పవిత్రను రేణుస్వామి అసభ్యకర పోస్టులతో వేధించిన కారణంగానే కన్నడ నటుడు దర్శన్ అతడిపై దాడికి తెగబడినట్లు పోలీసులు ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కన్నడ నటి రమ్య కూడా స్పందించింది. దర్శన్ ని కఠినంగా శిక్షించాలని, ఉరి శిక్ష, జీవిత ఖైదు విధించాలని అమె సోషల్ మీడియా వేదికగా కోరింది.