200 మందిని వెనక్కి నెట్టి నేనొచ్చా!
ఇప్పుడు నుపుర్ టైమ్ వచ్చింది కాబట్టి కొన్నాళ్ల పాటు అక్కతో కలిసి కాపీ తాగడం మానేస్తే బెటర్ అనిపిస్తుందని నవ్వేసింది.
కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ `టైగర్ నాగేశ్వరరావు` తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. అక్క తరహాలోనే అమ్మడి ప్రవేశం జరుగుతుంది. హిందీలో ఓ సినిమా చేస్తోన్న తెలుగులోనే నుపుర్ తొలి చిత్రం టైగర్ రిలీజ్ అవుతుంది. కృతిసనన్ కెరీర్ కూడా ఇలాగే లాంచ్ అయింది. హిందీ 'హీరో పంటీ' సినిమా చేస్తోన్న సమయంలోనే `వన్` లో అవకాశం రావడం..అది రిలీజ్ అవ్వడం ముందుగా జరిగాయి. టైగర్ నాగేశ్వరరావు లో మాస్ రాజాతో నుపుర్ ఆడిపాడనుంది.
అయితే ఈ ఛాన్స్ అమ్మడికి రావడం చాలా లక్కీ అనే తెలుస్తోంది. ఆ పాత్ర కోసం దర్శకుడు 200మందిని చూసారుట. చివరిగా నిన్ను చూసాక నువ్వు అయితేనే బాగుంటుందని దర్శకుడు వంశీ నిర్ణయంతో ఆ ఛాన్స్ నుపుర్ కి వరించినట్లు తెలిపింది. ఓ ప్రాజెక్ట్ విషయంలో ఇంతకు మించి ఇంకే కావాలని సంతోషం వ్యక్తం చేసింది. నిజమే 200 మందిని దాటి అవకాశం నుపుర్ కి రావడం అంటే లక్ ఉన్నట్లే గా. అందుకే ఇండస్ట్రీలో అదృష్టం కూడా కలిసి రావాలి అంటారు.
ఇక అక్కతో నుపుర్ చాలా స్నేహగా ఉంటుందిట. మార్నింగ్ కాపీ టైమ్ లో సినిమా ముచ్చట్లే నడుస్తా యట. కృతి ఎలాంటి పాత్ర చేసినా నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేస్తుందిట నుపుర్. ఇప్పుడు నుపుర్ టైమ్ వచ్చింది కాబట్టి కొన్నాళ్ల పాటు అక్కతో కలిసి కాపీ తాగడం మానేస్తే బెటర్ అనిపిస్తుందని నవ్వేసింది. నిజమే కదా! లేకపోతే కృతికి అడ్డంగా నుపుర్ దొరికినట్లే. ఎన్నో ఆశలతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న అమ్మడిని ఇప్పుడు రివర్స్ లే ఆడేసుకోదు.
ఇక రవితేజ తో ఆన్స్ సెట్స్ లో నుపుర్ తో హిందీలో మాట్లాడేవారుట. ఆ రకంగా సెట్స్ లో భాష పరంగా ఇబ్బంది తలెత్తదని తెలిపింది. హిదీలో డబ్ అయిన రవతేజ సినిమాలన్నీచూసేసిందిట. మాస్ రాజా అన్నది ఆయనకి తగ్గ పేరు అంది. తెలుగులో రామ్ చరణ్ ..నాని..విశ్వక్ సేన్ నటన అంటే ఇష్టమట. కీర్తిసురేష్.. సాయిపల్లవి లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో ఒదిగిన విధానం నచ్చిందిట.