ఆ స్టార్ క‌పుల్స్ విడిపోవ‌డంతోనే కుమార్తెకు ఆ స‌మ‌స్యా?

తాజాగా తొలిసారి ఐరాఖాన్ త‌ల్లిదండ్రులు విడిపోవ‌డం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. `నా చిన్న‌త‌నంలో ఇంట్లో ఎప్పుడూ సంద‌డి వాతావ‌ర‌ణం ఉండేది.

Update: 2024-11-30 19:30 GMT

బాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్ మొద‌టి భార్య రీనా ద‌త్తా. ఆ దంప‌తుల‌కు పుట్టిన బిడ్డ ఐరాఖాన్. విడాకుల‌తో వేరైనా త‌ల్లిదండ్రుల ప్రేమ‌ను మాత్రం ఐరాఖాన్ కి ఏనాడు దూరం చేయ‌లేదు. భార్యా భ‌ర్త‌లుగా విడిపోయినా ఐరాఖాన్ కోసం స్నేహితులుగా క‌లిసి త‌ల్లిదండ్రుల ప్రేమ‌ను అందిచేవారు. తాజాగా తొలిసారి ఐరాఖాన్ త‌ల్లిదండ్రులు విడిపోవ‌డం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. `నా చిన్న‌త‌నంలో ఇంట్లో ఎప్పుడూ సంద‌డి వాతావ‌ర‌ణం ఉండేది.

నా త‌ల్లిదండ్రులు గొడ‌వ‌లు ప‌డిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. కుటుంబ స‌భ్యులు ఎదురుగా వాళ్లెప్పుడు గొడ‌వ ప‌డ‌లేదు. అంద‌రం సంతోషంగా ఉండేవాళ్లం. వాళ్లు విడాకులు తీసుకున్న స‌మ‌యంలో అదినాపై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌ద‌నుకున్నా. అది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణ‌యం కాద‌ని ఆ త‌ర్వాతే తెలిసింది. దానివ‌ల్ల వారి జీవితాలు మారిపోవ‌డంతో ఎంతో బాధ‌ప‌డ్డా. మాన‌సికం కృంగుబాటుకు గుర‌య్యాను.

థెర‌పిస్టుల సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకున్నా. ఆ విష‌యంలో ఎవ‌రినీ నిందించాల్సిన అవ‌స‌రం లేదని అర్దం చేసుకున్నా. విడిపోయిన‌ప్ప‌టికీ త‌ల్లిదండ్రులు మమ్మ‌ల్ని ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకున్నారు. గొప్ప ప్రేమ‌ను పంచారు` అని అంది. ఐరాఖాన్ చాలా కాలం పాటు మానసిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డింది. త‌ల్లింద‌డ్రులు విడిపోవ‌డంతో? ఆమె ఆ ర‌క‌మైన స‌మ‌స్య‌కు గురైందని తాజాగా ఆమె మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది.

ఐరాఖాన్ ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌టంలో నుపుర్ శేఖ‌ర్ ఎంతో కేరింగ్ తీసుకున్నాడు. నుపుర్ ఒక జిమ్ కోచ్. ఐరాఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకోక ముందు మానసిక ఒత్తిడిని జ‌యించ‌డంలో నుపుర్ కీల‌క పాత్ర పోషించాడు. అమీర్ ఖాన్-రీనాద‌త్తా 1986లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఐరాఖాన్ తో పాటు కొడుకు జునైద్ ఖాన్ ఉన్నాడు. 2002లో అమీర్ దంప‌తులు విడాకులు తీసుకున్నారు.

Tags:    

Similar News