మల్టీస్టారర్ అంటే ఐకాన్ స్టార్ ఒప్పుకుంటాడా?
ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసాడు. అయితే ఇప్పుడీ సినిమా మల్టీస్టారర్ అనే ప్రచారం జరుగుతోంది.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ భారీ ప్రాజెక్ట్ కు సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయింది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ముందుకొచ్చింది. రేపో మాపో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే బన్నీ కూడా డేట్లు కేటాయించాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసాడు. అయితే ఇప్పుడీ సినిమా మల్టీస్టారర్ అనే ప్రచారం జరుగుతోంది.
బన్నీతో పాటు కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ కూడా భాగమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని శివ కార్తికేయన్ ని రంగంలోకి దించుతున్నట్లు వినిపిస్తుంది. ఇటీవలే `అమరన్` తో శివ కార్తికేయన్ సౌత్ లో మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అమరన్ బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కాబట్టి కార్తికేయన్ ఎంటర్ అయితే ప్రాజెక్ట్ కి మరింత హైప్ వస్తుందని అట్లీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కానీ ప్రాజెక్ట్ మల్టీస్టారర్ అయితే ఐకాన్ స్టార్ అంగీకరిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బన్నీ `పుష్ప` ప్రాంచైజీతో పాన్ ఇండియాలో ఓ సంచలనంగా మారాడు. `పుష్ప 2` ఒక్క భాగమే 1850 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. `పుష్ప` మొదటి భాగం `ది రైజ్` కూడా కలుపుకుంటే ఆ వసూళ్ల లెక్క 2000 కోట్లకు పైగానే ఉంటుంది. ఇది బన్నీ ఒకే సినిమాతో రెండు భాగాల్లో సాధించిన వసూళ్ల లెక్క.
అంటే బన్నీ రేంజ్ ప్రభాస్ రేంజ్ సరిసమానం. ఇంకా చెప్పాలంటే? డార్లింగ్ ప్రభాస్ కంటే బన్నీ సోలోగా సాధించిన సక్సెస్ ఇది. `బాహుబలి`లో రానా కూడా ఉన్నాడు. అది ఇద్దరి భాగస్వామ్యంలో సాధించిన వసూళ్లు. అలాగే బన్నీ పాన్ ఇండియాలో తానో సంచలనంగా మారాడు. అలాంటి బన్నీ సినిమాలో మరో స్టార్ కు చోటిస్తే? అంగీకరిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. బన్నీ సోలో గా సత్తా చాటాలన్నదే అతడి ఆసక్తిగా సన్నిహితుల నుంచి వినిపిస్తోన్న సమంచారం. ఒకవేళ శివ కార్తికేయన్ ఉన్నా? ఆ పాత్ర కేవలం కీలంగా ఉండాలి తప్ప సరిసమాన హోదాలో ఉంటే? బన్నీ రిజెక్ట్ చేయడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరేం జరుగుతందన్నది చూడాలి.