బాలీవుడ్ ఆడియన్స్ కి డాకు ఎక్కాడా..?

ఐతే ఈ సినిమాను కేవలం తెలుగు ఆడియన్స్ కే కాకుండా హిందీ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే పనులు మొదలు పెట్టారు.

Update: 2025-01-25 02:30 GMT

నందమూరి బాలకృష్ణ కె ఎస్ బాబీ కాంబోలో వచ్చిన డాకు మహారాజ్ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ముందు నుంచి చాలా కాన్ఫిడెన్స్ తో ఉండగా రిలీజ్ తర్వాత అదే రిజల్ట్ వచ్చింది. ఐతే ఈ సినిమాను కేవలం తెలుగు ఆడియన్స్ కే కాకుండా హిందీ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే పనులు మొదలు పెట్టారు. సంక్రాంతికి రిలీజైన సినిమా రిజల్ట్ చూసిన తర్వాత హిందీ రిలీజ్ డేట్ లాక్ చేశారు.

రిపబ్లిక్ వీకెండ్ కలిసి వచ్చేలా డాకు మహారాజ్ హిందీ వెర్షన్ ఈ శుక్రవారం రిలీజ్ చేశారు. బాలకృష్ణ సినిమాలు హిందీలో అది కూడా సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకే డబ్బింగ్ వెర్షన్ హిందీ రిలీజ్ అవ్వడం చాలా అరుదు. అఖండ సినిమా డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ రాబట్టింది. అఖండ 2 ని డైరెక్ట్ పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దానికి ముందు శాంపిల్ గా డాకు మహారాజ్ సినిమాను హిందీ వెర్షన్ రిలీజ్ చేశారు.

ఐతే బాలయ్య సినిమాను చూసిన హిందీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. మన దగ్గరతో పోల్చితే మాస్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులు తక్కువే. ఐతే వాళ్లు నచ్చే మాస్ వేరే రకంగా ఉంటాయి. డాకు మహారాజ్ యాక్షన్ సీన్స్ ఆడియన్స్ కు మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ లాంటి సీనియర్ హీరో నుంచి ఇలాంటి ఫైట్స్ అసలు ఊహించలేదు.

తెలుగులో సినిమా సక్సెస్ అవ్వగా హిందీ రిలీజ్ కి డిమాండ్ పెరిగింది. సో కమర్షియల్ లెక్కలు ఏమి లేకుండా ఎంత వచ్చినా లాభమే అని చెప్పొచ్చు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైశ్వాల్ నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా కూడా ఈ సినిమాలో నటించింది కాబట్టి హిందీ ఆడియన్స్ కు అదొక స్పెషల్ క్రేజ్ అని చెప్పొచ్చు. డాకు మహారాజ్ హిందీ రిలీజ్ డే టాక్ పర్వాలేదు అన్నట్టుగా ఉండగా సినిమా తో బాలయ్యకు అక్కడ కూడా సూపర్ ఫ్యాన్స్ ఏర్పడేలా ఉన్నారు.

Tags:    

Similar News