ఆ స్టార్ హీరోని లైన్ లో పెడుతున్నాడా?
చేతిలో హీరోలున్నారని ఎడా పెడా సినిమాలు చేయడం లేదు. ఏ హీరోతో చేయాల్సిన స్టోరీ ఆ హీరోతో చేస్తూ ముందుకెళ్తున్నాడు.;
కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయాలని స్టార్ హీరోలంతా క్యూలో ఉన్న సంగతి తెలిసిందే. లోకేష్ నుంచి పిలుపు వెళ్లాలే గానీ ఉన్న పళంగా సినిమాలు చేయాలని హీరోలంతా ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన మాత్రం సెలక్టివ్ గా వెళ్తున్నాడు. చేతిలో హీరోలున్నారని ఎడా పెడా సినిమాలు చేయడం లేదు. ఏ హీరోతో చేయాల్సిన స్టోరీ ఆ హీరోతో చేస్తూ ముందుకెళ్తున్నాడు.
ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో 'కూలీ' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఉపేంద్ర, నాగార్జున లాంటి స్టార్లు కూడా భాగమయ్యారు. ఇద్దరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతే కాదు బాలీవుడ్ నుంచి మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ ని కూడా రంగంలోకి దించారు. ఇందులో ఆయన కూడా గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే అమీర్ పై షూటింగ్ పూర్తి చేసారు.
అయితే అమీర్ ఖాన్ తో కనగరాజ్ బాలీవుడ్ లో సోలో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. `కూలీ` సెట్ లోనే అమీర్ కి స్టోరీ లైన్ వినిపించినట్లు కోలీవుడ్ మీడియాలో తాజాగా ప్రచారం జరుగుతోంది. అమీర్ ఇమేజ్ కి తగ్గ ఓ కొత్త యాక్షన్ స్టోరీ వినిపించాడుట. అమీర్ కి కూడా నచ్చడంతో పాజిటివ్ గా స్పందిం చారుట. దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అయితే అమీర్ తో సినిమా అంటే ఇప్పటికప్పుడు సాధ్యం కాదు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ పూర్తి చేయా ల్సిన ప్రాజెక్ట్ లున్నాయి. `కూలీ` తర్వాత `ఖైదీ 2` పట్టాలెక్కిస్తారు. అలాగే సూర్యతో `రోలెక్స్` చిత్రం కూడా పూర్తి చేయాలి. ఇవి పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ఎలా లేదన్నా రెండేళ్లు సమయం పడుతుంది. ఆ తర్వాతే అమీర్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం ఉంటుంది.