సితార కాంపౌండ్ లో రవితేజ కూతురు.. ఏం నేర్చుకుంటోంది..
ఈ నేపథ్యంలో రవితేజ కూతురు మోక్షధ సైతం తన సినీ ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.
సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే టాలెంట్ మాత్రమే కాదు, అనుభవం కూడా అవసరం. ప్రత్యేకించి, స్టార్ వారసులు తమ సొంత శైలిని రూపొందించుకోవాలంటే ముందుగా క్రాఫ్ట్ పై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో రవితేజ కూతురు మోక్షధ సైతం తన సినీ ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఆమె నటనకు బదులుగా దర్శకత్వ శాఖపై ఆసక్తి చూపుతూ, ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ఉన్న ఓ సినిమాలో సహాయ దర్శకురాలిగా పని చేస్తోందట.
మోక్షధ ఈ దిశగా వేస్తున్న అడుగులు పరిశ్రమలో అందరిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో, కొత్త తరానికి చెందిన వారసులు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తూ తమకు అవసరమైన అనుభవాన్ని సంపాదించుకుంటున్నారు. ఇదే తరహాలో మోక్షధ కూడా పని చేస్తుండటంతో, ఆమెలోని ఆర్టిస్టిక్ సైడ్ మరింత బయటపడుతుందని భావిస్తున్నారు. నటనలో కాకుండా, తెర వెనుక ఓ విజయవంతమైన డైరెక్టర్‌గా ఎదగాలనే ఆమె ఆలోచన ప్రత్యేకం.
ఇక రవితేజ తన పిల్లలకు నేర్పిన గుణం స్పష్టంగా కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ పిల్లలలో ఎక్కువగా విదేశాల్లో కోర్సులు చేసి వచ్చి డైరెక్షన్‌లో అడుగుపెడుతున్న పరిస్థితి ఉంది. కానీ రవితేజ పిల్లలు ఇండస్ట్రీలోనే మెళకువలు నేర్చుకుంటూ, నేరుగా అనుభవం పొందుతున్నారు. మోక్షధకు ఇది కేవలం డైరెక్షన్ మాత్రమే కాదు, సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్‌పై అవగాహన పెంచుకునే అవకాశం.
ఇక ఆమె సోదరుడు మహాధన్ కూడా ఈ దిశలో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. మహాధన్ నటనతో పాటు డైరెక్షన్‌లో కూడా శిక్షణ తీసుకుంటున్నాడట. రాజా ది గ్రేట్ లో చిన్నప్పటి రబితేజగా మహాధన్ నటించిన విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్‌లో ఇప్పటికే చాలామంది యువ నటులు డైరెక్ట్‌గా కెమెరా ముందుకు రాకముందే సీనియర్ దర్శకుల వద్ద శిక్షణ పొందారు.
కీరవాణి కుమారుడు శ్రీ సింహ సుకుమార్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసి అనుభవం పొందాడు. అదే తరహాలో మహాధన్ కూడా సుప్రసిద్ధ దర్శకుల వద్ద శిక్షణ తీసుకుంటూ తన మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో, రవితేజ సినీ ప్రయాణం తమ పిల్లలకు ఇన్‌స్పిరేషన్‌గా మారినట్లు స్పష్టమవుతోంది. రవితేజ కూడా తన కెరీర్ ప్రారంభంలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసి, అనుకోకుండా నటుడిగా మారి, తరువాత స్టార్‌గా ఎదిగారు.
ఇప్పుడు ఆయన వారసులు కూడా అదే శైలిని అనుసరించి తమను తాము రుజువుచేసుకోవాలని భావిస్తున్నారు. ఇది ఒక తండ్రిగా రవితేజ వారికి ఇచ్చిన గొప్ప మార్గదర్శకం అని చెప్పవచ్చు. మొత్తానికి, మోక్షధ, మహాధన్ ఇద్దరూ తమ తండ్రి సూచనలతో ముందుకు సాగుతున్నారు. మరి వారి భవిష్యత్తు అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.