నాని మెగా మాస్టర్ ప్లాన్ లీక్ అయ్యిందా..?

అలాంటిది ఒక సినిమా అనుభవం ఉన్న శ్రీకాంత్ ఏం చెప్పి ఒప్పించాడో అంటూ చర్చ జరుగుతుంది.

Update: 2025-02-21 02:30 GMT

న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన మార్క్ సినిమాలు చేస్తున్నాడు. అ! తో నిర్మాతగా తన అభిరుచి ఏంటో చూపించిన నాని హిట్ సీరీస్ లను నిర్మిస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం హిట్ 3 సినిమాలో నటిస్తూ నిర్మిస్తున్నాడు నాని. ఈ సినిమాతో పాటుగా శ్రీకాంత్ ఓదెల సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. ఐతే శ్రీకాంత్ ఓదెలతో తన సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవితో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు నాని. చిరంజీవిని కథ చెప్పి ఒప్పించడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటిది ఒక సినిమా అనుభవం ఉన్న శ్రీకాంత్ ఏం చెప్పి ఒప్పించాడో అంటూ చర్చ జరుగుతుంది.

ఇక ఈ సినిమాను నాని నిర్మించడం మరో సర్ ప్రైజింగ్ థింగ్ అని చెప్పొచ్చు. చిరంజీవిని చూసి స్పూర్తి పొంది హీరోగా మారిన నాని ఆయన్ను ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. శ్రీకాంత్ ఓదెలతో నాని సినిమా పూర్తయ్యాకనే చిరు సినిమా ఉంటుందని తెలుస్తుంది. నాని శ్రీకాంత్ కలిసి చేసిన దసరా బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఆ సినిమాను మించేలా ప్యారడైజ్ ని ప్లాన్ చేస్తున్నారు.

ఐతే చిరుతో శ్రీకాంత్ ఓదెల చేస్తున్న సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాని కూడా ఉంటాడని టాక్. శ్రీకాంత్ ఓదెల కథ చెప్పినప్పుడే నాని కూడా సినిమాలో కీలక పాత్ర చేస్తాడని చెప్పి ఒప్పించాడట. ఐతే అది చిరంజీవి, నాని మల్టీస్టారర్ సినిమా అనుకోవచ్చా అంటే కాదు కానీ నాని ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాత్ర చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో సినిమా ఉంది. ఐతే అనిల్ సినిమా మళ్లీ సంక్రాంతికే అంటున్నాడు. మరి ఈలోగా ఏం చేస్తాడన్నది చూడాలి. అనిల్ చిరంజీవి సినిమా పూర్తయ్యాకనే శ్రీకాంత్ ఓదెల సినిమా ఉండే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమాలో చిరు ఎలాంటి పాత్రలో కనిపిస్తారు. ఈ మెగా మూవీలో నాని రోల్ ఏంటన్న విషయాలు త్వరలో తెలుస్తుంది.

Tags:    

Similar News