ప్రభాస్ తో 2.30 గంటల సినిమా సాధ్యం కాదా?
ప్రభాస్ 'బాహుబలి'తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రెండున్నర గంటల్లో సినిమా సాధ్యం కాదా? రెండు భాగాలుగా చెప్పాల్సిన కథని ఒక్క భాగంలో చెప్పలేరా? రెండున్నర గంటలకు బధులు మూడు గంటలు తీసుకున్నా సమయం సరిపోవడం లేదా? అంటే ప్రస్తుతం సన్నివేశం అలాగేకనిపిస్తుంది. ప్రభాస్ 'బాహుబలి'తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. 'బాహుబలి' రాజులు..రాజ్యాలకు సంబంధించిన కథ కావడంతో? రాజమౌళి దాన్ని రెండు భాగాలు చేసి రిలీజ్ చేసాడు.
రెండిటా సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్',' ఆదిపురుష్' చిత్రాలు రిలీజ్ అయి ప్లాప్ అయ్యాయి. లేకపోతే వీటికి కంటున్యూటీ కథలు తెరపైకి వచ్చేవేమో. ఆ తర్వాత 'సలార్', 'కల్కి' కూడా రెండు భాగాలుగా వస్తున్నాయి. ఇప్పటికే వీటి మొదటి భాగాలు భారీ విజయం సాధించడంతో? రెండవ భాగం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవి భారీ స్పాన్ ఉన్న కథలు కావడంతో? రెండు భాగాలుగా చెప్ప డంలో అర్దం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న 'పౌజీ' కూడా రెండు భాగాలు రిలీజ్ అవుతుందనే ప్రచారంలో ఉంది.
ఇది 1800 ఏళ్ల కాలం నాటి స్టోరీ. లవ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. దీంతో పాటు ప్రభాస్' రాజాసాబ్' షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. అయితే రాజాసాబ్ కూడా రెండు భాగాలుగా మారుతి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇది ఓ చిన్న సినిమాగా ప్రారంభమైన బడ్జెట్ భారీగా ఖర్చు అవ్వడంతో మేకర్స్ రెండు భాగాలు ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తుంది.
ఈ కథని ఒక్క భాగంలో చెప్పడానికి వీలున్నా అధిక బడ్జెట్ కారణంగా రెండు ముక్కలుగా చీల్చుతున్నట్లు సమాచారం. వ్యవ హారం చూస్తుంటే ప్రభాస్ తో ఏ ఒక్కరూ రెండున్నర గంటల సినిమా తీసేలా కనిపించలేదు. పాన్ ఇండియాలో డార్లింగ్ ఛరిష్మాతో కోట్ల వసూళ్లు రాబట్టొచ్చు అన్న స్ట్రాటజీతోనే మేకర్స్ ముందుకెళ్తున్నారు. ఇది అన్ని వేళలా కూడా సాధ్యం కాదన్నది గుర్తించాలి.