బిగ్ షాక్: ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో పుష్ప-2 రిలీజ్ లేదా!?
ఓ భారీ సినిమా ప్రసాద్స్ లో రిలీజ్ కాకపోవడం అన్నది సినిమా చరిత్రలోనే ఇదే తొలిసారి. అయితే అందుకు ఓ కారణం ఉంది.
'పుష్ప-2' పాన్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 4 నుంచే ప్రీమియర్ షోలు పడుతున్నాయి. థియేటర్లను బన్నీ అభిమానులు అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. అయితే ఈ సినిమా ప్రసాద్ మల్టీప్లెక్స్ లో రిలీజ్ అవ్వడం లేదని సమాచారం. ప్రీమియర్ షోలు మాత్రమే కాదు..రెగ్యులర్ షోలు కూడా ఈ మల్టీప్లెక్స్ లో పడటం లేదని తెలుస్తోంది.
ఓ భారీ సినిమా ప్రసాద్స్ లో రిలీజ్ కాకపోవడం అన్నది సినిమా చరిత్రలోనే ఇదే తొలిసారి. అయితే అందుకు ఓ కారణం ఉంది. మల్టీప్లెక్స్‌లు - మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీదారుల మధ్య తలెత్తిన వివాదం కారణంగానే రిలీజ్ ఆటంకం ఏర్పడినట్లు సమాచారం. నివేదికల ప్రకారం డిస్ట్రిబ్యూటర్లు మల్టీప్లెక్స్‌లలో సినిమాను ప్రదర్శించడానికి వెనుకాడుతున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్‌ల మాదిరిగా కాకుండా 50:50 ఆదాయ-భాగస్వామ్య నిష్పత్తిని డిమాండ్ చేస్తున్నారు.
ఈ కారణంగానే డిస్ట్రిబ్యూటర్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లపైనే ఎక్కువగా ఆధార పడుతున్నారు. ఏషియన్ సినిమాస్- పీవీఆర్ సంస్థలతో డిస్ట్రిబ్యూటర్లు ఆ రకమైన సమస్యను పరిష్కరించుకున్నారు. పంపిణీదారుల నిబంధనలకు మల్టీప్లెక్స్ చైన్ దిగొచ్చినా? ప్రసాద్ మల్టీప్లెక్స్ మాత్రం అందుకు విరుద్దంగా ఉందనే వాదన పంపిణీదారుల నుంచి వినిపిస్తుంది. ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం ఈ విషయంలో మొండి వైఖరితో వ్యవహరిస్తుందని పంపిణీ దారులు ఆరోపిస్తున్నారు.
దీంతో డిస్ట్రిబ్యూటర్లు తమ నిబంధనలకు రాని పక్షంలో సినిమా ప్రదర్శనను నిలిపివేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడా ప్రభావం సినిమాపై పడింది. శుక్రవారం వచ్చిందంటే ప్రసాద్ మల్టీప్లెక్స్ వద్ద ఎంతో కోలాహాలంగా ఉంటుంది. రివ్యూలు...యూట్యూబ్ ఛానెళ్లు....మెయిన్ స్ట్రీమ్ హడావుడి పెద్ద ఎత్తున ఉంటుంది. కానీ ఈవారం మాత్రం అవన్నీ లేనట్లే.