రష్మిక అడగడం కాదు వాళ్లే పెంచేస్తారు..!

ఐతే రష్మిక్ సినిమాలో ఉంది అంటే ఆ పాత్రకు పూర్తిస్థాయి న్యాయం జరిగినట్టు.

Update: 2024-12-07 03:30 GMT

నేషనల్ క్రష్ రష్మిక కెరీర్ ఒక రేంజ్ ఫాం లో కొనసాగుతుంది. అదేంటో రష్మిక చేసిన సినిమాలన్నీ వరుస బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. బాలీవుడ్ లో యానిమల్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న అమ్మడు లేటెస్ట్ గా పుష్ప 2 తో మరోసారి అదరగొట్టేసింది. పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక సూపర్ అనిపించేసింది. పుష్ప 1 లో కన్నా ఈ పార్ట్ లో ఆమెకు కాస్త స్కోప్ ఎక్కువ దొరికేసింది. ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా రష్మిక ఇంప్రెస్ చేసింది. ఐతే రష్మిక్ సినిమాలో ఉంది అంటే ఆ పాత్రకు పూర్తిస్థాయి న్యాయం జరిగినట్టు.

పుష్ప 2 లో శ్రీవల్లి పాత్రతో అది మరోసారి ప్రూవ్ చేసింది అమ్మడు. యానిమల్ హిట్ తోనే రష్మిక కు భారీ ఆఫర్లు వస్తుండగా పుష్ప 2 ఎఫెక్ట్ తో మరిన్ని క్రేజీ ఛాన్స్ లు వచ్చేలా ఉన్నాయి. అంతేకాదు రష్మిక మరీ ఆలోచిస్తే ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ కి ఇంకా పెంచి ఇచ్చేలా చూస్తున్నారు. హిట్ కొట్టిన హీరో అయినా హీరోయిన్ అయినా రెమ్యునరేషన్ టాప్ లేపేస్తారని తెలిసిందే.

యానిమల్ హిట్ అయిన టైంలోనే రష్మిక రెమ్యునరేషన్ గురించి ప్రత్యేక డిస్కషన్ జరగ్గా ఇప్పుడు అది నిజం చేసేలా ఉంది. కథ నచ్చితే రెమ్యునరేషన్ గురించి హీరోయిన్స్ పెద్దగా పట్టించుకోరు కానీ ఆమెకు మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను బట్టి నిర్మాతలే సినిమా సినిమాకు కథానాయికల రెమ్యునరేషన్ పెంచేస్తారు. అందులోనూ వరుస బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్న హీరోయిన్ అయితే మాత్రం అడిగిన దానికన్నా ఎక్కువే ఇస్తారు.

పుష్ప 2 కోసం రష్మిక దాదాపు రెండు సినిమాలకు ఇవ్వాల్సిన డేట్ ఇచ్చిందట. ఆ విషయాన్ని నిర్మాత చెప్పి షాక్ ఇచ్చారు. సో ఆమెలా సినిమా కోసం కమిటెడ్ గా ఉన్న కథానాయికలకు రెమ్యునరేషన్ కాస్త ఎక్కువ ఇచ్చినా పర్లేదని చెప్పొచ్చు. పుష్ప 2 ప్రమోషన్స్ లో పాల్గొనడమే కాదు సోషల్ మీడియాలో పుష్ప 2 గురించి పెట్టే ప్రతి కామెంట్ కు రష్మిక ఓపికగా రెస్పాండ్ అవుతుంది. రష్మిక డెడికేషన్ తో ఆడియన్స్ ని ఆమె ఫ్యాన్స్ గా మార్చేసుకుంటుంది. ప్రస్తుతం రష్మిక కుబేర, గర్ల్ ఫ్రెండ్, సికిందర్ సినిమాల్లో నటిస్తుంది. కుబేర సినిమాలో కూడా ఆమెకు మంచి రోల్ దక్కిందని తెలుస్తుంది.

Tags:    

Similar News