రష్మిక ముందే అనుకుంది..కానీ సారీ మాత్రం ఆలస్యంగా!
తమ అభిమాన హీరో ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా విజయ్ పేరు చెబుతారు.
దళపతి విజయ్ కి రష్మికా మందన్నా, కీర్తి సురేష్ డై హార్డ్ ఫ్యాన్స్. హీరోయిన్లలో ఎంత మంది అభిమానులున్నా? వీళ్లిద్దరు మాత్రం వాళ్లను మించిన అభిమానం చూపిస్తారు. తమ అభిమాన హీరో ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా విజయ్ పేరు చెబుతారు. చివరికి వాళ్ల ఇష్టా ఇష్టాలు కూడా విజయ్ ఇష్టాల్నే పోలి ఉంటాయి. అంతగా విజయ్ ని వాళ్లిద్దరు లైక్ చేస్తారు. రష్మిక థియేటర్ లో చూసిన తొలి సినిమా విజయ్ నటించిన 'గిల్లి' అని చెప్పుకొచ్చింది.
అక్కడితో ఆగకుండా ఇంకా లోతైన వివరణ ఇచ్చే పని పెట్టుకుని అడ్డంగా బుక్కైంది. ఆ సంగతేంటో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. 'గిల్లీ' చిత్రం తెలుగులో మహేష్ నటించిన 'పోకిరి' సినిమాకి రీమేక్ అంది. అందులో ఓపాట ప్రత్యేకంగా ఇష్టపడతానని తెలిపింది. ఆ పాటకు స్టేజ్ మీద ఎన్నోసార్లు డాన్సు చేసినట్లు వెల్లడించింది. తెర మీద చూసిన తొలి హీరో విజయ్ అని, తొలి హీరోయిన్ త్రిష అని తెలిపింది. అయితే 'గిల్లి' సినిమా 'పోకిరి' రీమేక్ కాదు.
'ఒక్కడు' రీమేక్ అన్నది మర్చిపోయి అమ్మడు నోరుజారి అడ్డంగా బుక్కైంది. దీంతో నెటి జనులు ఆమెను ఆట పట్టించడం..ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. రకరకాల పోస్టులు..కామెంట్లు తెరపైకి వచ్చాయి. దీంతో రష్మిక మళ్లీ లైన్ లోకి వచ్చింది. 'అవును సారీ గిల్లి సినిమా ‘ఒక్కడు’కు రీమేక్ కదా.. అని ఇంటర్వ్యూ అయిపోయాక అనుకున్నా. 'పోకిరి'ని అదే టైటిల్ తో తమిళ్ లో రీమేక్ చేసారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తారని అప్పుడే అనుకు న్నాను.
అనుకున్నట్లే జరిగింది. మరోసారి సారీ. నాకు వాళ్లు నటించిన సినిమాలన్నీ ఇష్టమే' అంటూ సరదా ఎమోజీలను జోడించింది. రష్మిక మాట కారి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మాట కారితనంతోనే జనాల్ని ఆకర్షిస్తుంది. ఎంతో ఓపెన్ మైండెడ్. తనలో ఆ లక్షణాన్ని ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీ జనాలు అలాగే లైక్ చేస్తారు. ప్రతిభతో పాటు నిబద్దతో ఉండటం ఆమెకే చెల్లింది.