శ్రీలీల టర్నింగ్ పాయింట్.. క్లిక్కయితే కోట్ల వర్షమే..
తన అందం, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, గ్రేస్‌ఫుల్ డాన్స్ మూమెంట్స్‌తో సినీ ప్రేమికుల మనసు దోచిన ఈ బ్యూటీ, ఇప్పుడు నేషనల్ లెవల్ లో తన మార్క్ వేసేందుకు రెడీ అవుతోంది.;
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన శ్రీలీల, ఇప్పుడు తన కెరీర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. తన అందం, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, గ్రేస్‌ఫుల్ డాన్స్ మూమెంట్స్‌తో సినీ ప్రేమికుల మనసు దోచిన ఈ బ్యూటీ, ఇప్పుడు నేషనల్ లెవల్ లో తన మార్క్ వేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ తన స్థాయిని పెంచుకుంటున్న శ్రీలీల, 2025లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా మారనుంది.
ఈ బ్యూటీ 2025ను ఫుల్ బిజీగా ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తోన్న ఆమె, ఒక సినిమాకు 2 కోట్లకు పైనే డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అక్కడ కూడా అమ్మడు అదే రేంజ్ లో అందుకుంటున్నట్టు టాక్. తాజా సమాచారం ప్రకారం, శ్రీలీల బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ సరసన ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా, శ్రీలీల హిందీ సినిమాల్లో అడుగు పెట్టనుందన్న వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాదు, తమిళ పరిశ్రమలోనూ ఎంట్రీ ఇవ్వడానికి శ్రీలీల రెడీ అయ్యింది. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న SK25 సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించనుందట. ఈ ప్రాజెక్ట్ ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని శ్రీలీల భావిస్తోంది. ఇప్పటికే ఆమె డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కి తమిళనాట కూడా అభిమానులు పెరిగిపోతున్నారు. దీంతో అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా నిలిచేందుకు శ్రీలీలకు ఇదొక మంచి అవకాశం అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంతేకాదు, శ్రీలీల మరో బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. టాప్ ప్రొడక్షన్ హౌస్ మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ లో రూపొందనున్న సినిమాలో, సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన నటించే అవకాశముందని టాక్. ఇది నిజమైతే శ్రీలీలకు బాలీవుడ్‌లో మరింత క్రేజ్ రావడం ఖాయం. తెలుగు పరిశ్రమలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్‌లలో కూడా తన మార్క్ వేసేందుకు రెడీ అవుతోంది.
ఈ విధంగా చూస్తే, శ్రీలీల 2025ను తన కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్‌గా మలుచుకునేలా ప్లాన్ చేసుకుంటోంది. తెలుగు పరిశ్రమలో ఇప్పటికే ఆమెకు స్టార్ స్టేటస్ ఉండగా, ఇప్పుడు మిగిలిన ఇండస్ట్రీల్లో కూడా తన రేంజ్‌ను పెంచుకోవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. నటన, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఇప్పటికే యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల, ఈ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయితే నేషనల్ లెవల్ స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయం. అలాగే వరుస హిట్స్ వస్తే రెమ్యునరేషన్ పరంగా అమ్మడు 5 కోట్లను దాటించే అవకాశం ఉంది. డిమాండ్ కు తగ్గట్టు కోట్ల వర్షం కురవడం పక్కా. మరి 2025లో శ్రీలీల ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో చూడాలి.