తారక్ ని లాక్ చేయాలని విశ్వ ప్రయత్నాలా?
తారక్ కూడా కొన్ని రోజులుగా ముంబైలోనే ఉండి షూట్ లో బిజీగా ఉన్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'వార్ -2' తో బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి పని చేస్తున్నాడు. తారక్ జనరేషన్ హీరోల్లో హృతిక్ తో కలిసి పనిచేస్తోన్న మొట్ట మొదటి నటుడు తారక్ కావడం విశేషం. ఈ విషయంలో హృతిక్ సైతం ఎంతో సంతోషంగా ఫీలవుతున్నారు. తారక్ కోసం ఆన్ సెట్స్ లో ఎంత ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూసారో? హృతిక్ ఎన్నో సందర్భాల్లో రివీల్ చేసాడు. ప్రస్తుతం 'వార్-2' ఆన్ సెట్స్ లో ఉంది.
తారక్ కూడా కొన్ని రోజులుగా ముంబైలోనే ఉండి షూట్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే దేవరతోనూ పాన్ ఇండియాలో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. సోలోగా వచ్చి రికార్డు వసూళ్లు సాధించాడు. దీంతో తారక్ ని ఇప్పుడు బాలీవుడ్ గట్టిగానే గురి పెట్టినట్లు కనిపిస్తుంది. వార్ -2 తర్వాత సోలోగా అతడితో సినిమాలు చేయాలని బడా నిర్మాణ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయన్న సంగతి వెలుగులోకి వచ్చింది. దీనిలో భాగంగా భారీ పారితోషికం తో పాటు లాభాల్లో వాటా ఇస్తామని ఆఫర్ చేస్తున్నాయట.
ఈ లిస్ట్ లో బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు చాలా ఉన్నాయట. ఈ సంస్థల నిర్వాహకులు ఒకరికి తెలియకుండా ఒకరు తారక్ తో భేటీ అవుతున్నారుట. వీళ్లందరికంటే ముందే ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహర్ కర్చీప్ వేయాలని చూసారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత మిగతా సంస్థలన్నీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే భేటి అయిన ఏ సంస్థకు తారక్ మాట ఇవ్వలేదని సమాచారం.
తాను దాన్ని ఓ స్నేపూర్వకగా భేటీగానే భావించినట్లు సమాచారం. బాలీవుడ్ కి వెళ్లి సినిమాలు చేయనని 'దేవర' ప్రమోషన్ లో చెప్పిన సంగతి తెలిసిందే. మంచి అవకాశం...హృతిక్ తో కలిసి నటించే ఛాన్స్ రావడంతో వార్-2 లో నటించడం తప్ప అంతకు మించి హిందీ సినిమాలపై ఆసక్తితో వెళ్లి చేసే ఆలోచన తనకు లేదని చాలా సందర్భాల్లో చెప్పారు. తెలుగు సినిమా తర్వాత ఏ భాషకైనా ప్రాధాన్యత ఇస్తానన్నారు. అన్నట్లుగానే ఆయన ప్రయాణం సాగుతుంది.