అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌... ఫ్యాన్స్ కి పండగ

ఇప్పటి వరకు పాన్‌ ఇండియా ను టచ్ చేయని త్రివిక్రమ్‌ మొదటి సారి పాన్ ఇండియా సినిమాకు రెడీ అవుతున్నాడు.

Update: 2024-09-30 16:07 GMT

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబోలో ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం లో సినిమాలు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మూడు సినిమాల్లో అల వైకుంఠపురంలో సినిమా రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లు సొంతం చేసుకుంది. బన్నీ కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ చిత్రాల జాబితాలో ముందు వరుసలో నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. బన్నీ కెరీర్ లో మూడు కీలకమైన విజయాలను అందించిన త్రివిక్రమ్‌ ఇప్పుడు మరో బిగ్‌ ప్రాజెక్ట్‌ తో రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు పాన్‌ ఇండియా ను టచ్ చేయని త్రివిక్రమ్‌ మొదటి సారి పాన్ ఇండియా సినిమాకు రెడీ అవుతున్నాడు.

ఈ ఏడాది ఆరంభంలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రివిక్రమ్‌ ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేక పోయాడు. అందుకే అల్లు అర్జున్ తో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకోసం త్రివిక్రమ్‌ ఈసారి సరికొత్త జోనర్ లో సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటి వరకు ఆయన టచ్ చేయని సోషియో ఫాంటసీ, మైథలాజికల్ సబ్జెక్ట్‌ తో త్రివిక్రమ్‌ సినిమా చేయబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రారంభించబోతున్న ట్లు సమాచారం అందుతోంది.

ఇప్పటికే హ్యాట్రిక్‌ సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ లు మరో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆకట్టుకునే కథ, మంచి స్క్రీన్‌ ప్లే తో త్రివిక్రమ్‌ సినిమాలు ఉంటాయనే టాక్ ఉంది. ఇప్పుడు అంతకు మించి భారీతనం ఉండే విధంగా ఆయన ప్లాన్‌ చేస్తున్నారు. అదే నిజమైతే అల్లు అర్జున్ తో ఆయన తీయబోతున్న సినిమా కచ్చితంగా ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ చిత్రాల జాబితాలో నిలిచే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా వీరి సినిమా ఉండే అవకాశం ఉంది.

పుష్ప 2 షూటింగ్‌ తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. రికార్డ్‌ స్థాయి వసూళ్లతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. మరో వైపు ఈ సినిమా తో పాన్‌ ఇండియా రేంజ్ లో మరోసారి అల్లు అర్జున్ భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాడు. పుష్ప 2 తో వచ్చే క్రేజ్ తో త్రివిక్రమ్‌ తో చేయబోతున్న సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబోలో రాబోతున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్ కి కన్నుల విందు గా ఉండటం ఖాయం, ఫ్యాన్స్ కి పండగ తీసుకు రావడం ఖాయం అంటున్నారు.

Tags:    

Similar News