మరో యువ దర్శకుడిని లైన్ లో పెట్టిన వెంకీ

వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా ఇది కావడం విశేషం.

Update: 2024-11-22 11:30 GMT

సీనియర్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఈమధ్య మళ్ళీ స్లో అయ్యారు. కథల విషయంలో కాస్త జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని సినిమాతో సిద్దమవుతున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న థియేటర్స్ లోకి వస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా ఇది కావడం విశేషం.

దీంతో హ్యాట్రిక్ హిట్ కొడతామనే నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి వెంకటేష్ లో ఉన్న కామిక్ టైమింగ్ ని ఉపయోగించుకొని ఎంటర్టైన్మెంట్ బేస్డ్ కథలు అతనితో చేస్తున్నాడు. ప్రేక్షకులు కూడా వెంకటేష్ కామెడీని చూడటానికి ఇష్టపడతారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్ సక్సెస్ అయ్యింది. దీనికంటే ముందు విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్’ మూవీ చేసి డిజాస్టర్ అందుకున్నారు.

అది కంప్లీట్ గా సీరియస్ మోడ్ లో కాన్సెప్ట్ తో ఉంటుంది. వెంకటేష్ నుంచి ఆడియన్స్ ఎలాంటి అంశాలు కోరుకుంటున్నారో వాటితోనే ఈ సారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో థియేటర్స్ లోకి రాబోతున్నారు. దీనికంటే ముందు వెంకటేష్ త్రినాథ్ రావు నక్కిన, తరుణ్ భాస్కర్, అనుదీప్ కేవీ లాంటి దర్శకులతో మూవీస్ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే అవేవీ కార్యరూపం దాల్చలేదు.

కానీ యువ దర్శకులతో చేయాలనే ఇంట్రస్ట్ మాత్రం వెంకటేష్ లో ఉంది. అందుకే యంగ్ డైరెక్టర్స్ చెప్పే కథలు వింటున్నారంట. ఈ నేపథ్యంలోనే తాజాగా విమల్ కృష్ణ చెప్పిన కథ నచ్చి చేయడానికి వెంకటేష్ ఒకే చెప్పారంట. సిద్దు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’తో విమల్ కృష్ణ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు రెండో సినిమాని విమల్ కృష్ణ చేయలేదు. ఏవో కారణాల వలన డీజే టిల్లు సీక్వెల్ కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.

ఇదిలా ఉంటే విమల్ కృష్ణ వెంకటేష్ కి మంచి కామిక్ క్యారెక్టరైజేషన్ ఉన్న కథని నేరేట్ చేసి ఒప్పించాడంట. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత వెంకటేష్ ఆ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ మూవీకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ‘డీజే టిల్లు’ లాంటి ఇంటరెస్టింగ్ క్యారెక్టర్ ని విమల్ కృష్ణ వెంకటేష్ కోసం క్రియేట్ చేస్తే కచ్చితంగా అది కావాల్సినంత వినోదం అందించే అవకాశం ఉంటుంది. వెంకటేష్ కూడా ఆచితూచి కథలు ఎంపిక చేసుకుంటూ మూవీస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విమల్ కృష్ణ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే కచ్చితంగా కొత్తదనం ఉండే ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Tags:    

Similar News