ఆ సినిమాటోగ్రాఫర్ కి అరుదైన గౌరవం!
అలాంటి వారూ క్రిష్ జాగర్లమూడి- జ్ఞాన శేఖర్ కాంబినేషన్ కూడా. `వేదం`,` గౌతమీ పుత్రశాతకర్ణి`, `మణికర్ణిక` ఇలా కొన్ని క్లాసిక్ హిట్ సినిమాలున్నాయి.
ఫిల్మ్ మేకింగ్ లో సినిమాటోగ్రాఫర్ పాత్ర గురించి చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడి విజన్ ని అర్దం చేసుకుని దానికి తెరపై అద్భుతంగా క్యాప్చర్ చేసి దృశ్యరూపం ఇవ్వడం ఛాయాగ్రాహకుండి పని. దర్శకుడు- సినిమాటోగ్రాఫర్ మధ్య సరైన అండర్ స్టాండింగ్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకే కొన్ని కాంబినేషన్లు ఎవ్వెర్ గ్రీన్ గా ఉంటాయి. రాజమౌళి-సెంథిల్ కుమార్, సుకుమార్-రత్నవేలు, మణిరత్నం-పి.సి శ్రీరాం ఇలా కొన్ని రేర్ కాంబినేషన్లు ఇండస్ట్రీలో ఎప్పుడూ విడిపోవు.
అలాంటి వారూ క్రిష్ జాగర్లమూడి- జ్ఞాన శేఖర్ కాంబినేషన్ కూడా. `వేదం`,` గౌతమీ పుత్రశాతకర్ణి`, `మణికర్ణిక` ఇలా కొన్ని క్లాసిక్ హిట్ సినిమాలున్నాయి. తాజాగా జ్ఞాన శేఖర్ కి అరుదైన ఐఎస్ సీ గౌరవం దక్కింది. సినిమా ద్వారా తన పనితనంతో మెప్పించినందుకు గానూ `ఐ ఎస్ సి` వారు తమ సొసైటీలోకి ఆహ్వానించి ఈ గౌరవాన్ని అందించారు. దీంతో జ్ఞాన శేఖర్ ఎంతో సంతోషం వ్యక్తం చేసారు. ఈ అవకాశం రావడం వెనుక తనకి కెమెరా మెన్ గా అవకాశాలిచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కొత్త గుర్తింపు తనకి మరింత బాధ్యతని పెంచిందన్నారు. ఐఎస్ సీ అనేది ఛాయాగ్రాహకులు ఎంతో గొప్ప గౌరవంగా భావిస్తారు. సినిమాలకు చాలా మంది సినిమాటోగ్రాఫర్లు పనిచేస్తారు. కానీ ఐ ఎస్ సీ అనే గుర్తింపు కేవలం కొంత మందికే ఉంటుంది. ఐ ఎస్ సి అంటే కేవలం సినిమాటోగ్రాఫర్ లకి ఇచ్చే అరుదైన గౌరవం. దేశంలో చాలా శాఖలకు సంబంధించి వివిధ శాఖలున్నాయి.
అలా కెమెరా పనితనంతో అద్భుతమైన వర్క్ అందించిన కొందరికి ఐఎస్ సీ గుర్తింపు దక్కుతుంది. ఐఎస్ సీ అంటే? (ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్ షార్ట్ కట్ లో (ISC) ). ఇకపై జ్ఞాన శేఖర్ తన పేరు పక్కన ఐఎస్ సీ అనే ట్యాంగ్ వేసుకోవడానికి అన్ని రకాలగా అర్హత సాధించినట్లు.