ఈషా అంబానీ సౌండ్ లెస్ దివాలీ!
అంబానీ ఇంట కుటుంబ సభ్యుల ఇంట వేడుక అంటే ఏ రేంజ్ లో జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు.
అంబానీ ఇంట కుటుంబ సభ్యుల ఇంట వేడుక అంటే ఏ రేంజ్ లో జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచము మాట్లాడుకునే అనంత్ అంబానీ పెళ్లి చేసి చూపించారు. అంతకుముందు పెద్ద కుమారుడు, కుమార్తెల పెళ్లి సైతం అంతే వైభవంగా చేసారు. ఇక మిగతా పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు వాటిని అలాగే ఆస్వాదిస్తారు. మరి రాబోతున్న దీపావళిని ఎలా ప్లాన్ చేస్తున్నారు? అంటే అందరికీ సంగతి ఏమో తెలియదు గానీ ఈషా అంబానీ మాత్రం తన ప్లానింగ్ ని ఇలా రివీల్ చేసింది.
చిన్ననాటి నుంచి పండగలంటే చాలా ఇష్టం. ఆ సమయంలో మా ఇల్లు బంధువులతో, పండగ వేడుకలతో కళకళ లాడుతుంది. ఎన్ని పనులున్నా? అమ్మానాన్నలు వాటిని పక్కనబెట్టి మాతోనూ, బందుమిత్రులందరితో గడిపేవారు. బిజీ జీవితంలో పండుగలు ఓ ఆటవిడుపు మాత్రమే కాదు. ఎన్నో విషయాల్ని, శాస్త్రాల్ని తెలియ జేసేవని అర్దమైంది. అయినా నాకు అన్ని పండగలో కెల్లా దీపావళి అంతే ఇష్టం.
ప్రతీ ఏడాది ఎంతో గ్రాండ్ గా చేసుకుంటాను. మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం, వెలుగుల్ని చూస్తూ ఆనందించడం అలవాటు. ఏటా క్రమం తప్పకుండా ఆ సంతోషాన్నిపొందుతాను. ఆ కాంతులు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినట్లు అనిపిస్తుంది. టపాసుల విషయానికి వస్తే పక్షుల్ని, జంతువుల్ని భయపెట్టి పర్యావరణానికి హాని చేసే వాటికి దూరంగా ఉంటాను. వాటికి బధులు మోతలు లేకుండా గ్రీన్ క్రాకర్స్ ను కాలుస్తాను. నేను అలాంటి వాళ్లను ప్రోత్సహిస్తాను` అంది.
అనంత్ అంబానీ పెళ్లి అయిన తర్వాత వచ్చిన తొలి దీపావళి ఇది. ఈ నేపథ్యంలో ఈషా అంబానీ పుట్టింటికి చేరుకుని కుటుంబ సభ్యులతో గ్రాండ్ గా వేడుకు చేసుకుంటుంది. మెట్టినింటి వేడుక కంటే పుట్టినింట వేడుక అంటే ఏ కుమార్తె అయినా ఎంతో సంతోషంగా పాల్గొంటుంది. తల్లిదండ్రులతో ఆ క్షణాలుప్రతీ కూమార్తెకు ఓ మెమోరీ లాంటివే.