హృతిక్ - సబా ఆజాద్ విడిపోయారా?

ఈ జంట ముంబైలో ఒకే ఇంట్లో నివ‌శిస్తున్నార‌ని, రోష‌న్ ల కుటుంబంతో సాబా బాగా కాలిసిపోయింద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి.

Update: 2024-07-29 04:07 GMT

హృతిక్ రోషన్ - సబా ఆజాద్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఈవెంట్‌లో కలిసి కనిపించడం ద్వారా తమ సంబంధాన్ని అధికారికంగా చేసుకున్నారు. అప్పటి నుండి చాలా సంద‌ర్భాల్లో ఒక‌రితో ఒక‌రు కలిసి క‌నిపించారు. ఆ ఇద్ద‌రూ ఒక‌రిని వీడి ఒక‌రు ఉండ‌లేము! అన్నంత‌గా క‌లిసిపోయారు. ఈ జంట ముంబైలో ఒకే ఇంట్లో నివ‌శిస్తున్నార‌ని, రోష‌న్ ల కుటుంబంతో సాబా బాగా కాలిసిపోయింద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి.

ఇంత‌లోనే ఆశ్చర్యకరంగా గ‌త‌ రెండు కీల‌క స‌న్నివేశాల్లో హృతిక్ ఒంటరిగా కనిపించ‌డం నెటిజ‌నుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జూలై 12న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకలో హృతిక్ ఒంటరిగా కెమెరాలకు పోజులిచ్చాడు. అంతే కాదు.. కొరియోగ్రాఫ‌ర్ కం డైరెక్ట‌ర్ ఫరా ఖాన్ తల్లి మరణం తర్వాత ఫ‌రా ఇంట్లో కూడా అతడు ఒంటరిగానే క‌నిపించాడు.

ఎప్ప‌టిలాగే జంట‌ల్ని వెంటాడే రెడ్డిట్టర్‌ల బృందం హృతిక్ జీవితంలో ప‌రిణామాల‌ను శ్ర‌ద్ధ‌గా గ‌మ‌నించింది. వారు త‌మ‌ ఆలోచనలను రెడ్డిట్ లో స్ప‌ష్ఠంగా వెల్ల‌డించారు. హృతిక్ - సబా విడిపోయే అవకాశం ఉందని ఊహించ‌డం ప్రారంభించారు. అయితే హృతిక్ - సబా ఒకరినొకరు ఇన్‌స్టాలో అనుసరిస్తున్నారు. ఒకరి పోస్ట్‌లను ఒక‌రు ఇష్టపడతున్నారు.

ఉపాధి కోల్పోవడంపై సబా ఆవేద‌న‌:

ఇటీవల సబా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తాను త‌న ఉపాధి అవ‌కాశాల్ని కోల్పోవ‌డం గురించి ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ముఖ్యంగా వాయిస్‌ఓవర్ ఛాన్సులు తగ్గిపోయాయ‌ని ఆరోపిస్తూ సుదీర్ఘ నోట్ రాసింది. హృతిక్‌తో తన సంబంధాన్ని ప్ర‌స్థావిస్తూ తన వ్యక్తిగత జీవితం తన వృత్తిగ‌త‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో సబా వెల్లడించింది. సబా తనకు వాయిస్‌ఓవర్ జాబ్‌లు అవసరం లేదని భావించిన దర్శకుడితో సంభాషణను కూడా షేర్ చేసారు.

ఈ పోస్ట్ లో స‌బా త‌న స్వ‌రాన్ని బ‌లంగా వినిపించారు. త‌న‌లోని స్వ‌తంత్య్ర భావాల‌ను బ‌య‌ట‌పెట్టారు. సబా పోస్ట్‌లో ఇలా ఉంది. ``సరే, మీరు ఏం సూచిస్తున్నారు? మీరు జీవితంలో ఎక్కడ ఉన్నారో, అంటే నేను ఎవరితో డేటింగ్ చేస్తున్నానో .. దాని వ‌ల్ల VO లాంటి ఉద్యోగం నేను చేస్తానని అతడు అనుకోలేదు. విజయవంతమైన భాగస్వామితో సంబంధంలో ఉన్న స్త్రీ ఇకపై తన స్వంత టేబుల్‌పై ఆహారం పెట్టాల్సిన అవసరం లేదని భావించే చీకటి యుగాలలో మనం నిజంగా జీవిస్తున్నామా? లేదా ఆమె అద్దె, ఇత‌ర‌ బిల్లులు చెల్లించాల్సిన ప‌ని లేదా? లేక ఆమె చేసిన పనిని చూసి గర్వపడి తనని, తన కుటుంబాన్ని మాత్ర‌మే చూసుకుంటూ జీవించాలా??? ఎలాంటి పాత‌బ‌డిన ఊహ ఇది!!!?? అంటూ స్వ‌రం గ‌ట్టిగా వినిపించింది.

ఇద్దరు బలమైన స్వతంత్ర వ్యక్తులు కలిసి ఉన్న‌పుడు వారు తమ గుర్తింపులను లేదా వారి జీవితాలను, వృత్తిని వదులుకోరు. వారు తమ వ్యక్తిత్వాన్ని నిల‌బెట్టుకుంటూ స్వేచ్ఛ, బలం ఉన్న ప్రదేశంలో ఉంటారు. మొత్తం వృత్తిని కోల్పోరు. వేరొకరి అహంకార అజ్ఞానం నిజంగా బాధపెడుతుంది. కాబట్టి నేను నా వృత్తి నుంచి నిష్క్రమించలేదు, మీరందరూ ప్రకటనల‌లో అవ‌కాశాలివ్వండి..నేను ఇప్పటికీ VO లు చేస్తాను.. కాబట్టి దయచేసి మీ ఊహలను వ‌దిలేయండి! అని స‌బా సీరియ‌స్ నోట్ రిలీజ్ చేసింది.

దీనిని బ‌ట్టి స‌బా అజాద్ వృత్తిగ‌త జీవితాన్ని హృతిక్ ప్ర‌భావితం చేస్తున్నాడ‌ని అంతా భావించారు. అంతేకాదు.. ఆ ఇద్ద‌రి న‌డుమా ఏదో జ‌రుగుతోంద‌నే సందేహాలు కూడా అప్పుడే మొద‌ల‌య్యాయి. ఆ త‌ర్వాత రెండు కీల‌క ఈవెంట్లలో హృతిక్ ఒంటరిగా క‌నిపించ‌డంతో ఆ ఇద్ద‌రూ బ్రేక‌ప్ అయ్యార‌ని ఊహిస్తున్నారు. అయితే ఈ జంట‌ క‌లిసే ఉన్నారా లేదా విడిపోయారా? అనే దానిపై వారు ఇంకా స్పందించ‌లేదు. ఇవ‌న్నీ కేవ‌లం నెటిజ‌నుల ఊహాగానాలు మాత్ర‌మే. ఇటీవ‌ల అర్జున్ క‌పూర్- మ‌లైకా అరోరా బ్రేక‌ప్ ... హార్థిక్ పాండ్యా- న‌టాషా స్టాంకోవిక్ బ్రేక‌ప్ వార్త‌ల త‌ర్వాత హృతిక్- స‌బా బ్రేక‌ప్ అంటూ గాసిప్స్ హెడ్ లైన్స్ లోకొస్తున్నాయి.

Tags:    

Similar News