12కె ఫార్మేట్ లో సినిమా మనకిప్పట్లో సాధ్యమేనా?
ఇంకా ఇండియన్ సినిమాలన్నీ 4కె పార్మెట్ లో రిలీజ్ అవుతుంటేనే? ఎంతగా వెనుకబడి ఉన్నామన్నది అద్దంపడుతుంది.
4కె రెజొల్యూషన్ ఫార్మెట్ లో సినిమా రిలీజ్ అవుతుంటేనే అంతా అబ్బో అంటున్నాం. ఈ మధ్య కాలంలో పాత సినిమాల్నీ 4కె పార్మెట్ లో రిలీజ్ చేస్తుంటే? మనం ఎంతగా ఎదిగిపోయాం అని ఫీలైపోతున్నాం. మనంత అడ్వాన్స్ గా ఎవరూ లేరేమో! అన్న ఆలోచనలో ఉంటున్నాం. కానీ మార్కెట్ లో 8కె పార్మెట్...12 కె పార్మెట్ అందుబాటులో ఉందని ఎంత మందికి తెలుసు? అవును సినిమా పరంగా సాంకేతికంగా ముందుకు వెళ్తున్నా! ఇంకా ఇండియన్ సినిమాలన్నీ 4కె పార్మెట్ లో రిలీజ్ అవుతుంటేనే? ఎంతగా వెనుకబడి ఉన్నామన్నది అద్దంపడుతుంది.
టెక్నికల్ గా సినిమా ఎంతో వృద్దిలోకి వచ్చిందని సురేష్ బాబు లాంటి వారు మీడియా ముందుకొచ్చి చెప్పినా ఆయన ఐడియాని ఎంకరేజ్ చేసే వాళ్లే కరువయ్యారని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఓటీటీ సినిమాని ఏల్తుందని ఆయనెప్పుడో గుర్తించారు. కమల్ హాసన్ డీటీహెచ్ దే రాజ్యం అని కొన్నేళ్ల క్రితమే జోస్యం చెప్పారు. ఇప్పుడొస్తున్న అడ్వాన్స్ డు టెక్నాలజీ చూస్తుంటే వీళ్లంతా ఆనాడే ఎంతో అడ్వాన్స్ గా ఆలోచించగలగారని ఒప్పుకోవాల్సిందే. ఇండియాలోనే గొప్ప ఐమ్యాక్స్ లంటూ చెప్పుకుంటోన్న యాజమాన్యాలు కూడా ఇంకా పాత 4కె పద్దతిలోనే సినిమాని రిలీజ్ చేస్తున్నాయి.
తాజాగా చెన్నైకి చెందిన ప్రసాద్ కార్పోరేషన్ సంస్థ ఇప్పుడు ఏకంగా 12 రెజొల్యూషన్ లో ఓ రెండు దశాబ్ధాల క్రితం నాటి సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది. 2000 సంవత్సరంలో రిలీజైన కమల్ హాసన్ `హే రామ్` ని అప్ గ్రేడ్ చేసి భవిష్యత్తు తరాల కోసం సరికొత్త ప్రింట్ ని సిద్ధం చేసి ఉంచారు. 12 కెరెజొల్యూషన్ తో సినిమా రిలీజ్ చేస్తున్నారంటే? థియేటర్ లో ఆడియన్స్ కి మంచి అనుభూతి పొందుతాడు. తెరంతా సినిమా ఎంతో డీటెయిలింగ్ ఉంటుంది.
ఎంతో స్ఫష్టమైన నాణ్యతతో సినిమా కనిపిస్తుంది. తెర ఎన్ని ఎంచులున్నా సరే 12 కెపార్మెట్ లో రిలీజ్ అయితే థియేటర్ లో కూర్చున్నంత సేపు ఓ కొత్త వరల్డ్ లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఓ పాత సినిమాతోనే 12కె పార్మెట్ కి అప్ డేట్ చేసారంటే? కొత్త సినిమాల్ని ఇంకెంత అద్భుతంగా ..అందంగా చూపించొచ్చో! చెప్పాల్సిన పనిలేదు. మరి 12కె పార్మెట్ కాకపోయినా కనీసం అందుబాటులో ఉన్న 8కె పార్మెట్ లో అయినా సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. థియేటర్లో క్వాలిటీ 4 కెఅయినా టికెట్ ధరలు మాత్రం 12 కె పార్మెట్ లో ఆకాశన్నంటుతున్నాయంటున్నారు.