లీలా లిప్ లాక్ కి భయపడిందా?

నిజానికి అనూ కంటే ముందుగా మేకర్స్ ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ను తీసుకున్నారు.

Update: 2024-02-15 17:31 GMT

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'టిల్లు స్క్వేర్'. మల్లిక్ రామ్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇది 2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్. ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా.. రెండో భాగంలో సిద్ధూకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. నిజానికి అనూ కంటే ముందుగా మేకర్స్ ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ను తీసుకున్నారు.

‘పెళ్ళి సంద‌D’ సినిమా తర్వాత తెలుగులో శ్రీలీలకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి. వాటిల్లో 'డీజే టిల్లు 2' ఒకటి. షూటింగ్ కి వెళ్లడమే లేట్ అనుకుంటున్న టైంలో, ఏమైందో ఏమో కానీ ఈ బ్యూటీ సినిమా నుంచి తప్పుకుంది. డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేకే ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అనేక మంది హీరోయిన్లు తెర మీదకు వచ్చారు కానీ.. చివరకు అనుపమ పరమేశ్వరన్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరింది. అయితే అప్పుడు శ్రీలీల ఎందుకు తప్పుకుందనే విషయం ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైందని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.

వాలెంటైన్స్ డే స్పెషల్ గా 'టిల్లు స్క్వేర్' ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. 'డీజే టిల్లు' కథకు కొనసాగింపుగా వచ్చిన ఈ ట్రైలర్.. యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే సిద్దు తన క్రేజీ క్యారెక్టర్ ను, తనదైన డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ తో డబుల్ ఫన్ గ్యారంటీ అని హామీ ఇచ్చాడు. అయితే ఈ ట్రైలర్ లో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం అనుపమ పరమేశ్వరన్ అనే చెప్పాలి.

'టిల్లు స్క్వేర్' చిత్రంలో లిల్లీ అనే పాత్రలో అనుపమ కనిపించింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ట్రెండీ కాస్ట్యూమ్స్ లో, హాట్ లుక్స్ తో ఆకర్షించింది. రొమాంటిక్ సీన్స్ లో డీజే టిల్లు రాధికా పాత్రను మరిపించింది. నిరభ్యంతరంగా సిద్ధు జొన్నలగడ్డతో సుదీర్ఘమైన లిప్ లాక్ సన్నివేశంలో నటించి షాక్ ఇచ్చింది. మూడున్నర నిమిషాల వీడియోలోనే అంత ఉంటే, ఇక రెండున్నర గంటల సినిమాలో ఇంకెన్ని చుంబన దృశ్యాలు ఉంటాయో ఊహించొచ్చు. ఇలాంటి లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కాబట్టే.. శ్రీలీలా ఈ సినిమా నుంచి తప్పుకొని ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.

శ్రీలీలా ఇప్పటి వరకూ నటించిన సినిమాల్లో గ్లామరస్ గా కనిపించింది కానీ, పెద్దగా ఎక్స్ పోజింగ్ చెయ్యలేదు. రొమాంటిక్ సన్నివేశాల్లో యాక్ట్ చేసింది కూడా తక్కువే. కన్నడలో తన డెబ్యూ మూవీ 'కిస్' లో ఓ లిప్ లాక్ సీన్ లో నటించింది కానీ.. తెలుగులో మాత్రం పెదవి పెదవి కలిసే దృశ్యాల్లో నటించలేదు. కానీ ఇప్పుడు 'డీజే టిల్లు 2' సినిమాలో అలాంటి సీన్స్ చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణం చేతనే శ్రీలీలా నో చెప్పి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏదైతేనేం 'టిల్లు స్క్వేర్' సినిమా అనుపమ పరమేశ్వరన్ లోని రొమాంటిక్ యాంగిల్ ని పరిచయం చేసింది. పాత్ర డిమాండ్ చేయటంతో మొహమాట పడకుండా గాఢమైన లిప్ లాక్స్ చేయడానికి కూడా వెనకాడలేదు. 'డీజే టిల్లు' లో రాధికగా అందాలు ఆరబోసిన నేహా శెట్టికి ఎంత మంచి క్రేజ్ వచ్చిందో.. సీక్వెల్ తో మలయాళ భామ అనుపమకు అంతకుమించి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. మరి ఆమె పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Tags:    

Similar News