ఆయనకు భార్యగా ఈసారి ఛాన్స్ అవిడదా?
స్టోరీ సిద్దం చేసే సమయంలోనే రజనీకి సరసన 40 ఏళ్ల పైబడిన నటి అయితే? సరిపోతుంది అన్న భావనలో హీరోయిన్ పాత్రని జొపిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు 70 ఏళ్లు పైనే. అంత వయసున్న పాత్రకు హీరోయిన్లు ఎంపిక అంటే చిన్న విషయం కాదు. రజనీ కాంత్ ఇమేజ్ ని బేస్ చేసుకుని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ దర్శకులు తెలివిగా హీరోయిన్ల లేకుండానే మ్యానేజ్ చేస్తున్నారు. స్టోరీ సిద్దం చేసే సమయంలోనే రజనీకి సరసన 40 ఏళ్ల పైబడిన నటి అయితే? సరిపోతుంది అన్న భావనలో హీరోయిన్ పాత్రని జొపిస్తున్నారు.
కథతో పాటు ఆపాత్ర ట్రావెల్ అవుతంది. దీంతో సినిమాలోఆపాత్ర హీరోయిన్ అనే కంటే కీలకమైన రోల్ అనడం సబబు. జైలర్ సినిమాలో రమ్యకృష్ణ వైఫ్ పాత్రలో నటించారు. ఇంకా పాత్ర సినిమాలకు వెళ్తే ఈశ్వరీరావు, హ్యూమాఖురేషీ. వీళ్లంతా రజనీ వయసుకు తగ్గట్లు కనిపించారు. మరి రజనీకాంత్ తాజా సినిమా `వెట్టేయాన్` లో అలాంటి పాత్ర పోషించే బాధ్యత ఎవరిది అంటే? ఆ ఛాన్స్ మంజువారియర్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది.
మంజు వారియర్ కూడా రజనీకాంత్ ఏజ్ ని పక్కాగా మ్యాచ్ చేయగలరు. ప్రస్తుతం ఆమె వయసు 45 ఏళ్లు. అయితే సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందన్నది తెలియాలి. కీలక పాత్రనా? లేక సూపర్ స్టార్ వైఫ్ పాత్రకి తీసుకున్నారా? అన్నది చూడాలి. రజనీకాంత్ తో చిన్న కాంబినేషన్ సీన్ చేసినా ఆ నటికి ఎంతో గుర్తింపు. అలాంటి ఛాన్స్ కోసం ఎదురుచూసే సీనియర్ బ్యూటీలెంతో మంది. ఆ పాత్రల్ని కూడా ఆయన ఇమేజ్ ఆధారంగానే మేకర్స్ ఎంపిక చేస్తున్నారు.
ఇప్పటికే వేట్టాయాన్ షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ ...లొకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న `కూలీ` చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ కి ఎలాంటి హీరోయిన్ లేదు. ఇందులో రజనీ కాంత్ గోల్డ్ స్మగ్లర్ పాత్ర పోషిస్తున్నారు. శ్రుతి హాసన్ మాత్రం ఓ కీలకపాత్ర పోషిస్తుంది.