'స్టాప్ ఇట్ ఒకే' అంటూ ఇచ్చి పడేసిన మృణాల్!
అయితే వాళ్ల జీవితాల్లో మృణాల్ ఠాకూర్ అంటూ ఓ వార్త మళ్లీ ప్రచారంలో కి వచ్చింది.
విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ ఓ జంట. వాళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతుల ప్రేమకు కానుకగా వామిక జన్మించింది. కోహ్లీ ఎక్కడ మ్యాచ్ లు ఆడినా అనుష్క గ్యాలరీ లో కూర్చుని భర్తని ఎంకరేజ్ చేస్తుంది. ప్రతిగా కొహ్లీ ప్రయింగ్ కిస్సులు విసురుతాడు. అలా ఆ ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే వాళ్ల జీవితాల్లో మృణాల్ ఠాకూర్ అంటూ ఓ వార్త మళ్లీ ప్రచారంలో కి వచ్చింది.
విరాట్ కొహ్లీని మృణాల్ లవ్ చేస్తుందని బాలీవుడ్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు ఊపందుకున్నాయి. దీంతో అంతా షాక్ అవుతున్నారు. పెళ్లైన విరాట్ ని లవ్ చేయడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారు. మృణాల్ కి ఏమైందంటూ నెట్టింట రకరకాల కామెంట్లు వైరల్ అవుతున్నాయి. దీంతో మృణాల్ స్టాప్ ఇట్ ఒకే అంటూ సీన్ లోకి వచ్చింది. ఇలాంటి వాటిని పోస్ట్ చేయడం ఆపాలంటూ అసహనం వ్యక్తం చేసింది.
వివరాల్లోకి వెళ్తే నాని హీరోగా నటించిన జెర్సీ హిందీ రీమేక్ లో మృణాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రచారంలో భాగంగా కోహ్లీతో ప్రేమలో ఉన్నానంటూ తన అభిమానాన్ని చాటుకుంది. సచిన్ టెండూల్కర్ అంటే కూడా ఇష్టమని తెలిపింది. తన సోదరిడి వల్ల క్రికెట్ పై ఆసక్తి మొదలైందదని, ఐదేళ్ల క్రితం తనతో కలిసి స్టేడియంలో మ్యాచ్ చూసిన విషయాలు ఇంకా గుర్తున్నాయని, అలాంటి నేను బ్లూ కలర్ జెర్సీ లో నటించడం సంతోషంగా ఉందని తెలిపింది.
అయితే ఇవే వ్యాఖల్ని మృణాళ్ ఠాకూర్ ఇప్పుడు అన్నట్లుగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ ఇన్ స్టాలో షేర్ చేసింది. దీంతో మృణాల్ మళ్లీ ప్రెష్ గా విరాట్ కోహ్లీ పై తన ప్రేమని చాటుకుందని నెట్టింట వైరల్ గా మారింది. ఈ ప్రచారం మృణాల్ దృష్టికి వెళ్లడంతో అమ్మడు వెంటనే స్పందించి..ప్రచారాన్ని ఖండించింది.