ఎన్టీఆర్ కి రోడ్డు ప్రమాదం.. నిజం కాదు..

నిన్న రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని వార్తలు వ్యాపించాయి.

Update: 2024-08-14 09:48 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా దేవర మూవీ షూటింగ్ కి సంబంధించి తన పోర్షన్ కంప్లీట్ చేసేశాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఎన్టీఆర్ కి సంబందించిన అన్ని సన్నివేశాల షూట్ ఫినిష్ అయ్యిందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారని, హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.


నిన్న రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని వార్తలు వ్యాపించాయి. ఎన్టీఆర్ ఎడమచేతి వేళ్ళకి గాయం కావడంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనే టాక్ నడిచింది. ఇక ఈ ప్రచారం నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి ఎలా ప్రమాదం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం ఫ్యాన్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఎన్టీఆర్ ఆక్సిడెంట్ పై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ టీమ్ తాజాగా ఈ ప్రచారాన్ని ఖండిస్తూ లేఖ విడుదల చేశారు. అందులో రోడ్డు ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని కన్ఫర్మ్ చేశారు. కేవలం జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ ఉండంగా చెయ్యి బెనికిందని చెప్పారు.

దీనికోసమే ఆయన బ్యాండేజ్ వేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదం జరిగిందనే వార్తలు నిజం కాదని ఖండించారు. ఇక దేవర మూవీ షూటింగ్ ఎన్టీఆర్ పోర్షన్ కంప్లీట్ అయ్యిందని తెలిపారు. మిగిలిన పెండింగ్ పార్ట్ అంతా త్వరలోనే కొరటాల శివ కంప్లీట్ చేయబోతున్నారని అన్నారు. అలాగే తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేసి ఫ్యాన్స్ ని కలవరపెట్టే ప్రయత్నం చేయొద్దని ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే దేవర షూటింగ్ కంప్లీట్ కావడంతో ఎన్టీఆర్ నెక్స్ట్ వార్ 2 మూవీ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారనే టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. రీసెంట్ గా డ్రాగన్ మూవీ ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరిగింది.

అయితే సెప్టెంబర్ 27న దేవర మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఆగష్టు నెల ఆఖరు నుంచి మూవీ ప్రమోషన్స్ పైన ఎన్టీఆర్ దృష్టిపెడతాడనే మాట వినిపిస్తోంది. దేవర సినిమా నుంచి ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన సాంగ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో దేవర సినిమాపై అంచనాలు గట్టిగానే పెరిగాయి.

Tags:    

Similar News