విల‌న్‌తో తెలుగు న‌టి డేటింగ్ నిజ‌మా?

తాజాగా మ‌రోసారి గుస‌గుస‌లు వినిపించ‌డానికి కార‌ణం ఉంది. విమల- వినయ్ జంట‌ సోషల్ మీడియాలో VV (VimalaVinay) పేరుతో ప్రత్యేక ఫోటోషూట్ సిరీస్ నుండి ఫోటోలను షేర్ చేసారు.

Update: 2024-05-12 06:41 GMT
విల‌న్‌తో తెలుగు న‌టి డేటింగ్ నిజ‌మా?
  • whatsapp icon

వ‌రుణ్ సందేశ్, త‌రుణ్ లాంటి యువ‌హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది విమ‌లా రామ‌న్. త‌న‌దైన అందం న‌ట‌ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకున్న ఈ బ్యూటీ చాలా కాలంగా టాలీవుడ్ లో క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌లే వ‌రుణ్ తేజ్ 'గాండీవ‌ధారి అర్జున‌'లో పెళ్ల‌యిన యువ‌తిగా న‌టించింది.

ఇక వ్య‌క్తిగ‌త విష‌యానికి వ‌స్తే.. విమ‌లారామ‌న్ డేటింగ్ గురించి చాలా కాలంగా గుస‌గుస‌లు ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో క‌థానాయిక‌గా ఓ వెలుగు వెలిగిన‌ విమలా రామన్, విలన్ పాత్రలతో పాపుల‌రైన‌ తమిళ నటుడు వినయ్ రాయ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నార‌ని త‌మిళ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఈ జంట స్నేహం ప్రేమాయ‌ణం గురించి చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి. అయితే త‌మ మ‌ధ్య‌ రిలేష‌న్ షిప్ గురించి ఆ ఇద్ద‌రిలో ఎవ‌రూ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.

తాజాగా మ‌రోసారి గుస‌గుస‌లు వినిపించ‌డానికి కార‌ణం ఉంది. విమల- వినయ్ జంట‌ సోషల్ మీడియాలో VV (VimalaVinay) పేరుతో ప్రత్యేక ఫోటోషూట్ సిరీస్ నుండి ఫోటోలను షేర్ చేసారు. ఇది వారి న‌డుమ సాన్నిహిత్యాన్ని సూచిస్తోంద‌ని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే విమ‌లా రామ‌న్ కానీ, విన‌య్ కానీ త‌మ డేటింగ్ వార్త‌ల‌ను అధికారికంగా ఇరువైపులా క‌న్ఫామ్ చేయ‌లేదు.

విమల తెలుగులో గాయం 2, ఎవరైనా ఎప్పుడైనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి వంటి చిత్రాలలో నటించింది. ముఖ్యంగా వినయ్ రాయ్ - విమలా రామన్ వరుణ్ తేజ్ చిత్రం 'గాండీవధారి అర్జున'లో పెళ్ల‌యిన‌ జంటగా న‌టించారు. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ.. ఆఫ్ ది స్క్రీన్ కెమిస్ట్రీ రెండూ మ్యాచ్ అయ్యాయని ఇప్పుడు మ‌రోసారి అభిమానులు గుస‌గుస‌లాడుతున్నారు.

Tags:    

Similar News