దిల్ రాజు మీద ఐటీ దాడులు.. వెనుక ఎవరు ఉన్నారు?

అయితే ఉన్నట్టుండి దిల్ రాజుపై ఐటీ రైడ్స్ నిర్వహించడానికి కారణమేంటి?, దీని వెనుక ఎవరు ఉన్నారు? అని సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.

Update: 2025-01-21 07:45 GMT

టాలీవుడ్ లో ఐటీ సోదాల కలకలం సృష్టించింది. మంగళవారం ప్రముఖ నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపుదాడులు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆయన వ్యాపార భాగస్వాముల ఇళ్ళలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివిధ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి దిల్ రాజుపై ఐటీ రైడ్స్ నిర్వహించడానికి కారణమేంటి?, దీని వెనుక ఎవరు ఉన్నారు? అని సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.

దిల్ రాజు సినీ నిర్మాత మాత్రమే కాదు, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్ కూడా. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆయన చాలా సఖ్యతగా ఉంటున్నారు. సీఎం దగ్గర నుంచి సినిమాటోగ్రఫీ మినిస్టర్ వరకూ అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి ప్రముఖ వ్యక్తి మీద ఇంత సడన్ గా ఐటీ దాడులు జరగడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీని వెనుక పెద్ద సినీ కుటుంబం ప్రమేయం ఏమైనా ఉందా? అనే అనుమానం కలుగుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన 'గేమ్ ఛేంజర్'.. మీడియం బడ్జెట్ లో తీసిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు ఇటీవలే సంక్రాంతి పండక్కి రిలీజ్ అయ్యాయి. వీటితో పాటు వచ్చిన 'డాకు మహారాజ్' మూవీకి కూడా ఆయన మేజర్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. ఇలా ఈసారి సంక్రాంతి సినిమాల పండగ మొత్తం దిల్ రాజు చుట్టూనే తిరిగింది. ఫెస్టివల్ సీజన్ కావడంతో టాక్ తో సంబంధం లేకుండా అన్ని చిత్రాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దీనికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కలెక్షన్ పోస్టర్లు విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజుపై ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ లో ఉన్న దిల్ రాజు నివాసాలు, ఆఫీసుల్లో ఒకేసారి ఐటీ దాడులు మొదలయ్యాయని తెలుస్తోంది. కేవలం దిల్ రాజు ఇళ్లపైనే కాకుండా.. ఆయన తమ్ముడు శిరీష్, కూతురు హన్సితా రెడ్డి నివాసాలపై కూడా ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అలానే 'పుష్ప' చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్‌ ఎర్నేని, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లపైనా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. సింగర్ సునీత భర్త, మాంగో రామ్ సంస్థలోనూ సోదాలు జరుగుతున్నాయి. నిర్మాత అభిషేక్ అగర్వాల్, సత్య రంగయ్య ఫైనాన్స్ కంపెనీ మీద కూడా ఐటీ రైడ్ జరుగుతున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ లో ఏకకాలంలో 8 ప్రాంతాల్లో 55 బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News