శారీరకంగా అలిసి పోతేనే మంచి అనుభూతి..!

ఒక వైపు స్టార్‌ హీరోకు జోడీగా నటిస్తూనే మరో వైపు చిన్న సినిమాలో కూడా ఐటం సాంగ్‌ చేయడం కేవలం ఈ అమ్మడికే చెల్లింది.

Update: 2024-02-19 09:04 GMT

యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శృతి హాసన్‌. చాలా తక్కువ సమయంలోనే కమల్‌ కూతురు అని కాకుండా సొంతం ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆమె ఫ్యాన్స్ అంటూ ఉంటారు.


బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఇంకా కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండే శృతి హాసన్‌ ఇతర హీరోయిన్స్ కు చాలా విభిన్నం అని పలు సందర్భాల్లో నిరూపించుకుంది. ఒక వైపు స్టార్‌ హీరోకు జోడీగా నటిస్తూనే మరో వైపు చిన్న సినిమాలో కూడా ఐటం సాంగ్‌ చేయడం కేవలం ఈ అమ్మడికే చెల్లింది.

హీరోయిన్ గా తనకు ఇచ్చిన అవకాశం ను సద్వినియోగం చేసుకుని, తన పాత్రకు న్యాయం చేయడం వరకు ఈమె తన దృష్టిని పెడుతూ ఉంటుంది. అంతే తప్ప తనకు పాత్ర పెద్దగా ఉండాలి, అలా ఉండాలి అనే గొంతెమ్మ కోరికలు కోరదు అని ఈ అమ్మడి గురించి ఇండస్ట్రీ లో టాక్ ఉంది.

తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎప్పుడూ వర్క్‌ ఉంటేనే బాగుంటుంది అన్నట్లుగా చెప్పుకొచ్చింది. కష్టపడి పని చేయడం తనకు ఇష్టం. మానసికంగా, శారీరకంగా అలసి పోతేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది.

రోజంతా కష్టపడి పని చేసి అలసి పోయి ఇంటికి వెళ్తే మంచి అనుభూతి కలుగుతుంది. అలా లేదంటే అదో పెద్ద చెత్త అనుభవం అన్నట్లుగా తాను భావిస్తాను. అందుకే ఎప్పుడూ ఏదో ఒక షూట్‌ ఉండాలని నేను కోరుకుంటాను అన్నట్లుగా శృతి హాసన్ చెప్పుకొచ్చింది.



Tags:    

Similar News