సూపర్ స్టార్ సినిమాకే నో చెప్పింది..!
నాచ్చియార్, లవ్ టుడే సినిమాలతో తమిళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా అన్ని సౌత్ భాషల ప్రేక్షకుల దృష్టిని, మీడియా వర్గాల దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ ఇవానా.
నాచ్చియార్, లవ్ టుడే సినిమాలతో తమిళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా అన్ని సౌత్ భాషల ప్రేక్షకుల దృష్టిని, మీడియా వర్గాల దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ ఇవానా. ఈ అమ్మడు వరుసగా రెండు మూడు సక్సెస్ లు దక్కడంతో ఒక్కసారిగా పారితోషికం పెంచేసింది అంటూ ఆ మధ్య తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి.
భారీగా పారితోషికం పెంచడంతో పాటు, ఇటీవల ఈమె నటించిన ఎల్జీఎం సినిమా ఫ్లాప్ అయింది. ధోనీ నిర్మించిన సినిమా అయినా కూడా తమిళ ప్రేక్షకులు ఎల్జీఎం ని లైట్ తీసుకున్నారు. దాంతో ఇవానా క్రేజ్ తగ్గింది. అంతే కాకుండా ఆమెకు ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి.
ఈ మధ్య కాలంలో ఆమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. అయినా కూడా సూపర్ స్టార్ విజయ్ సినిమాలో నటించేందుకు ఆఫర్ వస్తే నో చెప్పిందట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు తమిళ మీడియా సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న విజయ్ 68 సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో విజయ్ కి చెల్లి పాత్రకు గాను ఇవానా ను సంప్రదించారట. హీరోయిన్ అయితే ఓకే కాని చెల్లి పాత్రకు నో అంటూ డైరెక్ట్ గా ఇవానా చెప్పేసిందట.
హీరోయిన్ పాత్రల కోసం చూస్తున్న సమయంలో చెల్లి పాత్రలు చేస్తే ముందు ముందు అన్ని కూడా అలాంటి పాత్రలే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సూపర్ స్టార్ మూవీ అయినా కూడా చెల్లి పాత్రకు నో అంటూ తేల్చి చెప్పేసింది. మరి ఈమె కోరుకున్న హీరోయిన్ పాత్రలు దక్కేనా చూడాలి.